Thursday 5 December 2019

LIC పాలసీలు ఉన్నవారికి గుడ్‌న్యూస్






LIC పాలసీలు ఉన్నవారికి గుడ్‌న్యూస్ 

మీ దగ్గర ఎల్ఐసి పాలసీ ఉందా? గడువులోగా ప్రీమియం చెల్లించలేదా ? అయితే మీకు గుడ్‌న్యూస్. ఇక మీ క్రెడిట్ కార్డుతో ప్రీమియం చెల్లిస్తే ఎటువంటి  చార్జీలు ఉండవు. కొత్త రూల్  ఈ నెల 1వ తేది ( డిసెంబర్  1, 2019) నుండి    అమలులోకి వచ్చింది. గతంలో క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రీమియం చెల్లిస్తే అదనపు చార్జీలు కట్టవలిసి వచ్చేది. ఇప్పుడు ఎటువంటి చార్జీలు లేకుండా మీ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించుకోవచ్చు. డిజిటల్ లావాదేవీలను   ప్రోత్సహించాలనే  ఆర్ బి ఐ ఆదేశాలతో ఎల్ఐసి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు కొత్త ప్రీమియం, రెన్యువల్ ప్రీమియం, లోన్ రీపేమెంట్ , రుణాలపై వడ్డీ చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డ్‌ని వాడితే ఇకపై ఎటువంటి చార్జీలు ఉండవు. 

దీనితో పాటు, ఇంకొక ప్రకటనకూడా విడుదల చేసింది. ఈ డిసెంబరు 1 నుండి పాత పాలసీలు ఆపేసి కొత్త పాలసీలను తెచ్చే ప్రక్రియను ఎల్ఐసి రెండు నెలలకు వాయిదా వేసింది. 

No comments:

Post a Comment