Saturday 21 March 2020

జనతా కర్ఫ్యూ- Janata Curfew

జనతా కర్ఫ్యూని పాటిద్దాం 

ఇండియాలో కరోనా  ప్రభావం ఇప్పుడిప్పుడే  ఉధ్రుతమవుతోంది . దాన్ని అరికట్టేందుకు దేశ ప్రధానితో  పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా క్రుషి చేస్తున్నారు.  అన్ని రకాల అంతర్జాతీయ విమాన సర్వీసులను రెండు వారాల పాటు రద్ధు చేసింది. విదేశాలనుండి వచ్చేవారిని ఆయా ఏర్‌పోర్ట్‌లో అన్ని రకాల టెస్టులు చేసి వారిని 14 రోజులు ఐసోలోషన్‌లో  ఉంచుతున్నారు. వారికి కరోనా వ్యాది లేదని నిర్ధారణ అయ్యాక  వారిని తమ ఇళ్ళకి పంపిస్తున్నారు.  


భారత ప్రభుత్వం  విదేశాలనుండి రావాలనుకునేవారిని, తమ ప్రయాణాలను కొన్నిరోజులవరకు వాయిదా వేసుకోవాలని సూచిస్తోంది. తప్పనిసరి పరిస్తితుల్లో తప్ప తమ ప్రయాణాలను వాయిదా వెసుకోవాలని సూచిస్తోంది.

ఇటు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో కూడా కట్టుదిత్తమైన ఏర్పాట్లు చేసారు. ఈ నెల 31 వరకు అన్ని స్కూళ్ళు , సినిమా హాళ్ళు, రెస్టారెంట్లు, పార్కులు మూసివేయలాలని ఆదేశించిది. దేవాలయల్లోకి , ప్రార్ధనా మందిరాల్లోకి భక్తులను అనుమతించరాదని ఉత్తర్వులు జారీచేసింది. 

దీనిలో భాగంగానే  ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉండే తిరుపతిలో అన్ని దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.  ఈ పద్దతిని మిగతా దేవాలయాలు కూడా పాటిస్తున్నాయి. అన్ని రకాల దర్శనాలను రాదు చేసాయి.  

ప్రధాని నరేంద్ర  మోడి పిలుపు మేరకు అన్ని రాష్రాల ప్రజలు   మార్చి 22న జనతా కర్ఫ్యు ని పాటించనున్నారు. ఈ జనతా కర్ఫ్యూ  మార్చి 22న ఉదయం 7 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు అమలులో ఉంటుంది. ఈ సమయంలొ ఏ ఒక్కరు కూడా తమ ఇళ్ళను వదిలి బయటికి రాకూడదు. కరోనా మహమ్మరిని అరికట్టే ప్రణాళికలో భాగంగా  దీన్ని రూపొందించారు. 

ఇందుకోసం ఆయా రాష్ర ముఖ్యమంత్రులు తమ ప్రజలను ఈ జనతా కర్ఫ్యుని విజయవంతం చేయాలని విన్నపం చేస్తున్నారు.

No comments:

Post a Comment