Sunday 12 April 2020

ఏప్రియల్ 14వ తేదీని జాతీయ సెలవు దినంగా ప్రకటించిన కేంద్రం.




 

ఏప్రియల్ 14వ  తేదీ  అనేది ఇప్పుడు అందరి నోళ్ళలో నానుతున్న తేది. ఎందుకంటే కరోనా కారణంగా ఇండియాలో లాక్‌డౌన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ లాక్‌డౌన్ ఎత్తివేసేది ఏప్రియల్ 14వ తేదీ అని ప్రకటించింది. అందుకే అందరూ ఏప్రియల్ 14 వ తెదీ కోసం అందరూ ఎదురు ఛూస్తున్నారు.   

అయితే కేంద్రం  దీన్ని గుర్తుండిపోయేలా ఉండాలని నిర్ణయించినట్టుంది. అందుకే ఈ ఏప్రియల్ 14వ తేదీని జాతీయ సెలవు దినంగా ప్రకటిచారు. అయితే ఈరోజుకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే రాజ్యాంగ రూపకర్త  డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి. ఈ సెలవు  దినం రెండింటినీ గుర్తుంచుకునేలా చేస్తుందని  చెప్పొచ్చు.        

అయితే ఏప్రియల్ 14 తర్వాత లాక్‌డౌన్‌ని పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ని పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.  ఒడిశా మరియు పంజాబ్ ఈ నెల 30 వరకు పొడిగించాయి. మహారాష్ట్రలో ముంబాయిలొ లాక్‌డౌన్‌ని పొడిగించడం జరిగింది.  కేరళలొ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ని పొడిగించే అవకాశం ఉంది.  

మిగతా రాష్ట్రాలు కూడా ఇదే బాటలో వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.   దీనికి కారణం రొజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడం.

అయితే మిగిలిన రాష్ట్రాలు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం ముగిశాక  నిర్ణయం తీసుకోనున్నాయి. 

No comments:

Post a Comment