Thursday 30 April 2020

తెలంగాణలో కరోనా రహిత జిల్లాలు ఇవే


తెలంగాణలో కరోనా రహిత జిల్లాలు ఇవే.


తెలంగాణలో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్న గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకునే పకడ్బందీ చర్యలే ఇందుకు కారణమని చెప్పొచ్చు. ప్రభుత్వ యంత్రాంగం నిర్విరామంగా శ్రమిస్తూ, కరోనా కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటోంది.

అయితే తెలంగాణలో మొదటినుండి కొన్ని జిల్లాల్లో  కరోనా కేసులు నమోదు కాకపోవడం విశేషం. కొన్ని జిల్లాల్లో మొదట కేసులూ నమోదైనా ఇప్పుడూ అవి మొత్తానికి తగ్గుముఖం పట్టాయి. 

దీనితో తెలంగాణ ప్రభుత్వం కేసులు నమోదు కాని జిల్లాలను గుర్తించి, వాటిని కరోనా రహిత జిల్లాలుగా ప్రకటించింది. తేంగాణలో మొత్తం 33 జిల్లాల్లో 11 జిల్లాలను కరోనా రహిత జిల్లాలుగా ప్రకటించారు.

సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, ములుగు జిల్లాలను కరోనా రహిత జిల్లాలుగా ప్రకటించడం జరిగింది.

వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.
ఇక తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్ ఉన్న సంగతి తెలిసిందే. 

No comments:

Post a Comment