Tuesday 12 May 2020

Latest News: కేంద్రం మరోసారి లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందా? ఈరోజు రాత్రి జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ



కేంద్రం మరోసారి లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందా? ఈరోజు రాత్రి జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ. 

 

నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడీయో కాన్ఫరెన్స్ లో మట్లాడారు. కరోనాని అరికట్టే విషయంలో ఇప్పటిలాగే అందరూ కలసికట్టుగా పని చేయాలని కోరారు.

ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాష్ట్రంలో కరోనా కేసుల పరిస్థితులు, వైరస్ వ్యాప్తి ఎలా ఉంది అనే దాని గురించి అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఆర్ధిక కార్యకలపాలు ఊపందుకునే అవకాశం ఉందని, ఆ దిశగా ముందుకు నడవాలన్న అభిప్రాయాన్ని ప్రధాని మోడీ వ్యక్తం చేశారు. 

అయితే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అన్ని రాష్ట్రాలు రాబోయే రోజుల్లో ఆర్ధిక కార్యకలాపాల సంతుల్యతను, లాక్‌డౌన్ సడలింపుల తరువాత తీసుకోబోయే చర్యలకు సంబందించి బ్లూ ప్రింట్‌ని ఈనెల 15 వ తేదీ లోపు ఇవ్వాలని పధాని సూచించారు. 

అయితే ఇక్కడ చెప్పుకోవల్సిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే, కొన్ని సడలింపులతో లాక్‌డౌన్ మరి కొన్నిరోజులు పొడిగించే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అందరికి సంకేతం ఇచ్చారని తెలుస్తోది. అయితే ఈ లాక్‌డౌన్ 4.0 లో ముఖ్యంగా రోడ్లు మరియు రవాణా, రెవెన్యూ, ఏవియేషన్, పరిశ్రమల రంగాలకు ఈసారి ఎక్కువ సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది.  అలాగే జోన్ల విషయానికి వస్తే ఆరెంజ్, గ్రీన్ మరియు రెడ్ జోన్లను కేసుల ఆదారంగా మార్చే అవకాశం ఉంది. అలాగే రేడ్ జోన్లలో కొన్ని పరిమితమైన సమయం వరకు అన్ని షాపులు తెరవడానికి అనుమతి ఇవ్వవచ్చు.          
  
అయితే లాక్‌డౌన్ పొడిగిస్తే ఎన్ని రోజులు పొడగిస్తారు అన్న విషయం ఇంకా తెలవాల్సి ఉంది. ఈరోజు రాత్రి ప్రధాని నరేంద్ర మోడి జాతినుద్దేశించి మట్లాడనున్నారు. ఈ సందర్భంగా మోడీ ఏ కీలక ప్రకటన చేయనున్నారో అని ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.    

No comments:

Post a Comment