Saturday 23 May 2020

భారీ డీల్ కి నో చెప్పిన ఉప్పెన నిర్మాతలు



భారీ డీల్ కి నో చెప్పిన ఉప్పెన నిర్మాతలు


లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. ప్రభుత్వం థియేటర్స్ లో ఎప్పుడు విడుదల చేయడానికి అనుమతులు వస్తాయో క్లారిటీ లేదు. సినిమా విడుదల అవ్వాల్సిన సమయానికి విడుదల కాకపొతే చాలా నష్టాలను భరించాల్సి వస్తుంది. దీనితో అటు హీరోలు, నిర్మాతలు సినిమాని ఎలా ఎప్పుడు విడుదల చేయాలనే విషయంలో సందిగ్దంలో ఉన్నారు.

ఇప్పుడు విడుదలకు సిద్దమై ట్రెండింగ్ లో ఉన్న సినిమాల్లో ఒకటి ఉప్పెన. ఈ సినిమా ఏప్రియల్ 2 వ తేదిన విడుదల కావాల్సింది. ఈ సినిమాలోని పాటలు చాలా పాపులర్ అయ్యాయి. లాక్ డౌన్  కారణంగా విడుదల కాలేదు.  చివరికి  OTT ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు.  అయితే ఒక పాపులర్ OTT సంస్థ నుండి రూ. 14 కోట్ల డీల్ వచ్చినట్టు సమాచారం. కానీ ఉప్పెన నిర్మాతలు ఈ డీల్ ని రిజెక్ట్ చేసినట్టు తెలిసింది. ఎందుకంటే ఉప్పెన సినిమాకి అయిన బడ్జెట్ రూ.18 కోట్ల దాటిందట. అందుకే ఈ డీల్ వర్కౌట్ కాదనుకొని సున్నితంగా వదిలేసారు.

అయితే నిన్న సినిమా ఇండస్ట్రి మెగాస్టార్ చిరంజీవి ఆద్వర్యంలో తెలంగాణ సీయం కె. చంద్రశేఖర్ రావు గారిని కలవడం జరిగింది. సినిమా ఇండస్ట్రి లో 2 నెలలుగా షూటింగులు లేక, దానిమీద ఆధారపడ్డ వారు ఇబ్బంది పడుతున్నారని, షూటింగులకు అనుమతి ఇవ్వాలని సీయం ని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వం విధివిధానాలని రూపొందించి  అందరికి మేలు  జరిగేలా, వేలాది దినసరి వేతన కార్మికులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారని చిరంజీవి చెప్పారు.

No comments:

Post a Comment