Wednesday 27 May 2020

మే 31 తరువాత తెలంగాణలో లాక్ డౌన్, కర్ఫ్యూ యదాతధంగా కొనసాగించే యోచన.


మే 31 తరువాత తెలంగాణలో లాక్ డౌన్, కర్ఫ్యూ యదాతధంగా కొనసాగించే యోచన.


మే 31 తరువాత తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్, కర్ఫ్యూ యదాతధంగా ఇంకొన్ని రోజులు కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం రాష్త్రంలో కేసులు అక్కడక్కడ నమోదవుతూనే ఉన్నాయి. GHMC పరిధిలోని హైదరాబాద్,  రంగా రెడ్డి, మల్కాజిగిరి మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న హైదాబాద్  లోని  పహాడి షరీఫ్ లో ఒక్క ఇంట్లోనే 14 మందికి కరోనా పాసిటివ్ అని నిర్ధారణ అయింది. దీన్ని బట్టి చూస్తే కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది.

దీనికి తోడు, చాలా రోజుల తరువాత సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లో నిన్న కొత్త కేసులు నమోదు కావడం ఆందోళకరంగా మారింది. ఈ పరిస్టితుల్లో లాక్ డౌన్ మరియు కర్ఫ్యూ కొనసాగించి, కరోన కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈరోజు సీయం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సంబధిత  మంత్రులు, అధికారులతో భేటి కానున్నారు. లాక్ డౌన్ మరియు కర్ఫ్యూ కొనసాగించే దానిపై చర్చించి  నిర్ణయం తీసుకోనున్నారు.

దీనితో పాటు, GHMC పరిధిలో మే 31 తరువాత మాకు అనుమతులు ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. వీటిలో ముఖ్యంగా 
దుకాణాలు రోజు తెరుచుకునే విధంగా  అనుమతి. ప్రస్తుతం రోజు విడిచి రోజు తెరుచుకునే విధంగా ఆంక్షలు అమలులో ఉన్నాయి.

హోటళ్ళు , షాపింగ్ మాల్స్,స్కూల్స్, మతపరమైన ప్రార్ధనా మందిరాలు తెరుచుకోవడానికి అనుమతులు. దీనికి ప్రభుత్వం అంత తొందరపడి అనుమతులు ఇవ్వక  పోవచ్చు.  వీటి వల్ల కరోనా కేసులు పెరిగే అవశాలు ఎక్కువ.
హైదరాబాద్ సిటీలో  ఆర్టీసి బస్సులు, మెట్రో రైలు సర్వీసులు అనుమతి. కొన్ని ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.  ఎందుకంటే ఆర్టీసి ఇప్పటికే చాలా నష్టాల్లో కూరుకపోయింది. ఈ లాక్ డౌన్ వల్ల ఆ నష్టాలు రెట్టింపు అయ్యాయి.  తక్కువ మంది ప్రయాణికులతో కూడిన  బస్సులను నడపడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వ  ఉద్యోగులకు గత మార్చి నుండి సగం జీతాలు మాత్రమె అందుతున్నాయి. మే 17 తరువాత  అందరు ఉద్యోగులు తమ తమ విధులకు హాజరవుతున్నారు. ఈ నేపధ్యంలో వారు పూర్తి జీతం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈరోజు జరిగే సమావేశంలో వేటికి అనుమతులు ఇవ్వాలి, ఇవ్వకూడదు అనేదానిపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకోనున్నారు.

No comments:

Post a Comment