Saturday 9 May 2020

అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు మరొక శుభవార్త చెప్పింది. అదేంటంటే, అన్ని రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. అంతే కాకుండా సీనియర్ సిటిజెన్ల కోసం ప్రత్యేక టర్మ్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద సీనియర్ సిటిజెన్స్‌కి అధిక వడ్డీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లించనుంది. 

మే 10 వ తేదీ నుండి అమలు అయ్యే ఈ కొత్త వడ్డీ రేట్లు 7.25శాతం.  ఇంతకుముందు వడ్డీ రేట్లు 7.40 శాతం గా ఉంది.   అంటే ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్లు తగ్గించడం జరిగింది. 

మూడేళ్ళ రిటైల్ టర్మ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీ రేట్లపై 20 బేసిస్ పాయింట్లను తగ్గించింది.  

సీనియర్ సిటిజన్ల కోసం, "ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్" అనే రిటైల్ టర్మ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో డిపాజిట్లు చేసిన సీనియర్ సిటిజన్లకు అదనంగా 30 బేసిస్ పాయింట్ల ప్రీమియం వడ్డీని ఇవ్వనుంది. అయితే ఈ డిపాజిట్ల కాలపరిమితి తప్పనిసరిగా అయిదు సంవత్సరాలు ఉండాలి . ఈ పథకం 30 సెప్టెంబర్ 2020 వరకు అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.        

No comments:

Post a Comment