ఉప్పెన సినిమా OTTలో రిలీజ్ కానుందా ?
మెగాస్టార్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్
హీరోగా పరిచయమవుతున్న సినిమా ఉడైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం
వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా లిరికల్ సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
అయితే ఈ సినిమా ఏప్రియల్ 2 తేదిన విడుదల కావలిసి ఉంది. కానీ కరోన వల్ల
సినిమా విదులకు నోచుకోలేదు. సినిమా పూర్తయ్యి విడుదల కాకపొతే, నిర్మాతలు వాళ్ళు
బయట తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతుంటారు.
ఈ పరిస్థితుల్లో నిర్మాతల ముందు ఉన్న అవకాశం OTT ఫ్లాట్ఫామ్స్.
ఎందుకంటే ఈ కరోనా వల్ల లాక్ డౌన్ పూర్తిగా ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు. లాక్
డౌన్ ఎత్తేసినా సినిమా హాల్స్ కి అనుమతి అంత తొందరగా ఇవ్వక పోవచ్చు. అందుకే కొందరు
నిర్మాతలు OTT వైపు చూస్తున్నారు. OTT సంస్థలు మంచి ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. OTT ఫ్లాట్ఫామ్స్ ద్వారా హిందీ, తమిళ్, కన్నడ
సినిమాలు ఇప్పటికే విడుదల తేదీలను ప్రకటించాయి. హిందీలో స్టార్ హీరోలు కుడా OTT
ద్వారా విడుదల చేస్తున్నారు. అయితే తెలుగు సినిమాలు ఇంకా అంత ధైర్యం ఎందుకో
చేయట్లేదు. కొన్ని సినిమాలు సినిమా థియేటర్స్ లో చూస్తేనే బాగుంటుందని కొందరి
వాదన. వాళ్ళు థియేటర్స్ లో విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
అయితే ఉప్పెన సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాని OTT
ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మరి OTTలో వారి పెట్టుబడికి తగ్గ ఆఫర్ వస్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఈ
సినిమా బాగా వచ్చందని, అందుకే మేమే సొంతంగా
విడుదల చేయాలనుకున్నామని నిర్మాతలు చెప్పారు.
ఆహా లేదా అమెజాన్ ప్రైం లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని
తెలుస్తోంది. అయితే నిర్మాతలకు ఒక సమస్య వచ్చిందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ
సినిమా మొదట్లోనే ప్రముఖ OTT సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం చేసుకుంది.
అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ తో కాకుండా వేరే వాటితో ఒప్పందం కుదుర్చుకుంటే వాళ్ళు
లీగల్ వెళ్ళే అవకాశం ఉంది. దీనికోసం నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ తో చర్చలు
జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఇలా కాకుండా లాక్ డౌన్ పూర్తయ్యాక థియేటర్స్ తెరవడానికి ఎప్పుడు అనుమతి ఇస్తారో తెలిసాక నిర్ణయాన్ని
తీసుకుంటే బాగుంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.
ఈ సినిమాలో హిరోయిన్ గా కొత్త అమ్మాయి కృతి శెట్టి
నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. సంగీతం
దేవిశ్రీ ప్రసాద్ అందించారు.
దీనిపై నిర్మాతల నిర్ణయం ఎలా ఉండబోతోందో వేచిచూడాల్సిందే.
Waiting for this movie
ReplyDeleteVaishnav Tej first movie kabbati theatre lone chudali
ReplyDelete