Friday 15 May 2020

లాక్ డౌన్ వేళ ఇంటివారవుతున్న టాలీవుడ్ సెలెబ్రిటీలు

లాక్ డౌన్ వేళ ఇంటివారవుతున్న టాలీవుడ్ సెలెబ్రిటీలు

లాక్ డౌన్ ఒక్కొక్కరికి ఒకలా ఉపయోగపడుతోంది. మన టాలీవుడ్లో సెలెబ్రిటీలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే వివాహ కార్యక్రమాలను కానిచ్చేస్తున్నారు. ఎందుకంటే లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నందున, గుంపులు గుంపులుగా అందరు ఒక దగ్గర చేరడానికి వీలులేదు. సాధారణంగా సెలెబ్రిటీల వివాహాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. జన సమూహం కుడా భారీగానే ఉంటుంది.  అలా అని పెళ్లిని వాయిదా వేసే పరిస్థితి లేదు. కాబట్టి లాక్ డౌన్ లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. కొందరు నిశ్చితార్ధం చేసుకొని పెళ్లిపీటలు ఎక్కడానికి రెడీగా ఉన్నారు.

ఇందులో ముఖ్యంగా  మనం మాట్లాడుకోవాల్సింది దిల్ రాజు పెళ్లి గురించి. ఎన్నో రోజులుగా దిల్ రాజు మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ మదర్స్ డే రోజు మా నాన్న పెళ్లి అంటూ దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి ప్రకటించింది.  ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కొద్ది మంది సమక్షంలో వైఘా రెడ్డి తో వివాహం జరిగింది.

హ్యాపి డేస్ సినిమా తో ఫేమస్ అయి హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకన్న  నిఖిల్ పెళ్లి నిన్న జరిగింది. నిఖిల్ కూడా కొద్ది మంది  కుటుంభ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. నిఖిల్ సిద్దార్థ, పల్లవి శర్మ వివాహం నిన్నఉదయం హైదరాబాద్ లో జరిగింది. ఎప్పుడో జరగాల్సిన వివాహం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. లాక్ డౌన్ సమస్య ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేట్టు కనబడక పోవడంతో తక్కువ మందితో ఆర్భాటం లేకుండా నిఖిల్, పల్లవిల వివాహం జరిగింది.

నిన్న మహేష్ ఆచంటి ఉరఫ్ రంగస్థలం మహేష్  వివాహం ఈరోజు  జరిగింది. అడపా దడపా కొన్ని సినిమాల్లో నటిస్తూ, మధ్యలో ఈటివి లో ప్రసారమయ్యే  జబర్ధస్త్ లో కనబడుతూ, రంగస్థలం, మహానటి సినిమాల్లో మహేష్ నటనకు మంచి గుర్తిపు వచ్చింది. ఇప్పుడు  మహేష్ ని రంగస్థలం మహేష్ అని పిలుస్తున్నారు. మహేష్ ఆచంటి పెళ్లి నిన్న తూర్పుగోదావరి జిల్లాకి చెందిన పావని తో జరిగింది.

వీటితో పాటు హీరో నితిన్ కుడా తన పెళ్లి పనులు మొదలు పెట్టేసాడు. నితిన్ ఎంగేజ్మెంట్ ఫిబ్రవరి 15న తన స్నేహితురాలైన శాలిని తో జరిగింది. అయితే అప్పటికి ఇంకా లాక్ డౌన్ అమలు కానందున నితిన్ పెళ్లి డేట్ ఏప్రియల్ 16 న ఫిక్స్ చేసుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడింది.

గత రెండు రోజులుగా తెలుగు తమిళ ఇండస్ట్రిలో ఒకటే టాపిక్ మీదచర్చ జరుగుతోంది. అదే  రానా దగ్గుబాటికి పెళ్ళికూతురు దొరికేసింది. అందరిని ఆశ్చర్య పడేలా మన భల్లాల దేవుడు సోషల్ మీడియా లో ఒక పిక్చర్ పెట్టి దానికి కాప్షన్ she said YES అని  పెట్టాడు. దీనితో టాలీవుడ్ అంతా ఆశ్చర్యానికి గురైంది. ఆ అమ్మాయి పేరు మిహికా బజాజ్. గత 10 సంవత్సరాలుగా వీరిద్దరికీ పరిచయం ఉంది. దీన్నిరానా చాలా గోప్యంగా ఉంచాడు. వీళ్ళుఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం వీరి పెళ్లి వచ్చే డిసెంబర్ లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

No comments:

Post a Comment