Wednesday 13 May 2020

చిరు, వెంకీ ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

చిరు, వెంకీ ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

 

లాక్‌డౌన్ కారణంగా సినిమాలు, సీరియళ్ళు, రియాలిటీ షోలు అన్ని షూటింగులు లేక ఆగిపోయాయి. దీనితో
 అందరూ టీవిల్లో చూసిన సినిమాలు,  రిపీటెడ్ షోస్ చూస్తూ వారికి బోర్ కొట్టేసింది. దానితో అందరూ ఓటీటీ (Over The  Top) వైపు మళ్ళారు. అమేజాన్ ప్రైం, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, సన్ నెక్స్ట్, వీటితో పాటు మెగా ప్రొడ్యూసర్ రీసెంట్‌గా స్టార్ట్ చేసిన ఆహా. వీటన్నింటికీ ఇప్పుడు చాలా గిరాకీ పెరిగింది. ఇందులో కొత్త, పాత   సినిమాలతో పాటు వెబ్ సీరిసులు కూడా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. అందుకే బాలీవుడ్‌లో మంచి పేరున్న నటులు కూడా ఇందులో నటిస్తున్నారంటే, ఇవి  ఎంత పాపులర్ అయ్యాయో అర్ధమవుతుంది.

అయితే మన తెలుగు సినిమా కూడా మెల్లమెల్లగా అటువైపు పయనిస్తోందని చెప్పొచ్చు. తెలుగులో కూడా వెబ్ సీరిసుల హవా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు.

అలాగే  ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమా ఈ ఓటీటీ వైపు చూస్తోంది. కొత్త సినిమాలను కూడా సినిమా థియేటర్లలో కాకుండా, డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాం లలో విడుడల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. మొన్న తమిళ్ హీరో సూర్య తాను నిర్మించిన సినిమాని ఓటిటీ లో విడుదలకు ప్లాం చేసుకున్నాడు. కానీ తమిళనాడు థియేటర్స్ వాళ్ళు దీనికి ఒప్పుకోలేదు.  
  
మెగా ప్రొడ్యూసర్ స్టార్ట్ చేసిన ఓటీటీ ప్లాట్‌ఫామ్  పేరు ఆహా.   దీంట్లో కొన్ని కొత్త సినిమాలతో పాటు అన్ని రకాల  వెబ్ సీరిసులు ఉన్నాయి. అయితే మెగా ప్రొడ్యూసర్ మెగా ప్లాన్  చేస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే మెగాస్టార్ తో ఒక వెబ్ సీరిస్ ప్లాన్ చేస్తున్నారని,  చిరంజీవి కుడా వెబ్ సీరిస్‌లో నటించడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది.

అలాగే మరో సూపర్  ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా త్వరలో ఓ కొత్త ఓటీటీ ప్లాట్‌ఫాం స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈయన విక్టరీ వెంకటేష్ తో ఒక వెబ్ సీరిస్ ప్లాన్ చేయనున్నారని సమాచారం. 

చిరు, వెంకీ ల వెబ్ సిరీస్ ల గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇలా సీనియర్ హీరోలు ఓటీటీ ప్లాట్‌ఫామ్  లోకి వస్తే, తెలుగులో  ఓటీటీ  ప్లాట్‌ఫామ్  బిజినెస్ ఏ రేంజ్‌లో ఉంటుందో మరి.     

1 comment: