Saturday 2 May 2020

తెలంగాణలో సడలింపులపై సర్వత్రా ఉత్కంఠ.


తెలంగాణలో సడలింపులపై సర్వత్రా ఉత్కంఠ.

 

నిన్న కొన్ని కొత్త సడలింపులు ఇస్తూ లాక్‌డౌన్‌ని మే 17 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటనను జారీ చేసింది. ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్లలో ఎక్కువ సడలింపులను ఇచ్చింది. రెడ్ జోన్లలో యధావిధిగా కఠిన చర్యలు తప్పవని చెప్పింది.  

ఇందులో గ్రీన్ జోన్లలో ఉన్న ప్రాంతాలకు చాలా వరకు సడలిపులతో ఊరట లభించిందనే చెప్పాలి. ఎందుకంటే గ్రీన్ జోన్లలో అన్ని రకాల దుకాణాలను తెరుచుకోవొచ్చు. కాబ్‌లు, ఆటోలు, బస్సులకు కూడా అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ దానికి కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులుఇచ్చింది. కాబ్, ఆటోలలో ఒకరు, బస్సులలో 50 శాతం మంది మాత్రమే ప్రయాణించాలి. 

కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు మాత్రం ఒకటే అనుమానం. కేంద్రం అయితే ఈ సడలింపులని ఇచ్చింది కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సడలింపులకు అనుమతి ఇస్తారా లేదా. ఎందుకంటే పోయినసారి లాక్‌డౌన్‌ని కేంద్రం మే 3 వరకు పొడిగిస్తే తెలంగాణలో మాత్రం దాన్నిమే 7 వరకు పొడిగించారు. ఇప్పుడు కూడా కేంద్రం మే 17 వరకు పోడిగించిన సంగతి తెలిసిందే.

కేంద్రం ఇచ్చిన సడలింపులపైన నిన్న కేసీఆర్, సంబంధిత మంత్రులతో చర్చలు జరిపినట్టు సమాచారం. కేంద్రం ఇచ్చిన సడలింపులను తెలంగాణలో కూడా అమలు చేయాలా, చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది మరొకసారి మంత్రులతో సమీక్షించి నిర్ణయాన్ని ప్రకంటిచవచ్చు.

అయితే కేంద్రం మద్యం దుకాణాలకు కూడా కొన్నిరకాల షరతులతో అనుమతినిచ్చింది. ఈ విషయమై తెలంగాణలో మందు బాబులు కేసీఆర్ గారి నిర్ణయం కోసం ఎదురు చుస్తున్నారు. హైదరబాద్ లాంటి రెడ్ జోన్లలో  ఉన్న ప్రాంతాలు  కాకపోయినా  గ్రీన్ జొన్లలోనైనా అనుమతినిస్తారేమో అని మందు బాబులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
    

No comments:

Post a Comment