Monday 4 May 2020

వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త


వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త


ఈ లాక్‌డౌన్ టైంలో అందరూ ఇంటర్నెట్‌ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే వివిధ రకాల ఆఫర్లతో టెలికాం సంస్థలు ముందుకొస్తున్నాయి.

అయితే ఈ లాక్‌డౌన్‌లో వాట్సాప్ వినియోగం చాలా పెరిగింది. ఎందుకంటే ప్రపంచం అంతా కోవిడ్-19 కారణంగా లాక్‌డౌన్ అయిన సంగతి తెలిసిందే. కాబట్టి వివిధ దేశాల్లో ఉన్న తమవారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి వాట్సాప్ చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. దీనితో ఇంతకుముందు ఎన్నాడూ లేని విధంగా వాట్సాప్ వాయిస్ మరియు వీడియో కాలింగ్ పెరిగిపోయాయని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. 

దీన్ని దృష్టిలో పెట్టుకొని  వాట్సాప్‌లో ఒక ఫీచర్‌ని అప్‌డేట్ చేసింది. అదే  వాయిస్ మరియు వీడీయో కాన్ఫరెన్స్ కాలింగ్ ఫీఛర్. ఇంతకు ముందు మీరు వాయిస్ లేక వీడియో కాలింగ్‌లో ఒకేసారి కాన్ఫరెన్స్ లో  నలుగురితో  మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు  దాన్ని డబుల్ చేసామని ఆ సంస్థ ప్రకటించింది. అంటే మీరు ఒకేసారి 8 మందితో వాయిస్ మరియు వీడియో  కాంఫరెన్స్‌లో మాట్లాడుకోవచ్చు.          

ఇది అన్ని ఆండ్రాయిడ్ మరియు  ఆపిల్ డివైస్‌లకు వర్తిస్తుంది. అయితే మీరు ఈ ఫీఛర్‌ని ఉపయోగించుకోవాలంటే మీ వాట్సాప్‌ని లేటెస్ట్ వెర్శన్‌లోకి అప్‌డేట్ చేసుకోవాలని ఆసంస్థ తెలిపింది.        

కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా వాట్సాప్ వినియోగదారులు గత నెల రోజుల నుండి రోజుకు సగటున 15 బిలియన్ నిమిషాలు మాట్లాడుతున్నారని ఆ సంస్థ తెలిపింది.  

No comments:

Post a Comment