మెగాస్టార్ చిరంజీవి నాలుగు రోజుల క్రితం తనకు కరోనా
పాజిటివ్ అని ప్రకటించడంతో అటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇటు తెలుగు ప్రజలు
ఉలిక్కి పడ్డారు. మళ్ళి రెండురోజులకే తను పరీక్ష చేయించుకున్న కిట్స్ లోపం వల్ల తన
ఫలితం తప్పుగా వచ్చిందని, ఇప్పుడు చేయించుకున్న పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని
చెప్పడంతో అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఈరోజు దీపావళి సందర్భంగా చిరంజీవి దంపతులు, తనకు
సినిమా రంగంలో గురువైన కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. పండుగ
సందర్భంగా కె. విశ్వనాథ్ గారి దంపతులకు చిరు
దంపతులు నూతన వస్త్రములతో సత్కరించి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. పండుగ రోజు ఇలా
తన గురువు, ఆత్మ బంధువు కె.విశ్వనాథ్ గారిని కలిసి, దంపతులను సత్కరించి, వారితో
గడిపిన సమయం సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని చిరంజీవి అన్నారు.
No comments:
Post a Comment