యాదేవీ సర్వ భూతేషు .... అమ్మలగన్నయమ్మ
ముగురమ్మల మూలపుటమ్మ అని పోతన గారు, అంతకు ముందున్న పెద్దలు, మహా ఋషులు చెప్పడం
జరిగింది. వేదం చెప్పిన ప్రకారం ఆశ్వీయుజ మాసం ప్ర్రారంభం అవగానే శరదృతువు
మొదలవుతుంది. శరద్రువుతో పాటు శరన్నవరాత్రులు మొదలవుతాయి.జగన్మాత ఆరాధనకు అత్యంత విశేష దినాలు ఈశరన్నవరాత్రులు. తొమ్మిది రోజులపాటు శాక్తేయ,
సౌమ్య రూపాల్లో దేవీ అలంకార పూజను నిర్వహిస్తే అమ్మవారి అనుగ్రహం సిద్దిస్తుంది.
మూల నక్షత్రం రోజున సరస్వతి
దేవిని ఆరాధిస్తారు. తొమ్మిది రోజులు వీలు కాని వారు త్రిరాత్రి వ్రతాన్ని
ఆచరిస్తారు. చివరి రోజైన విజయ దశమి రోజు శ్రీ రాజ రాజేశ్వరీ దేవిని, శమీ
వృక్షాన్ని పూజిస్తారు.
ఆశ్వీయుజ శుద్ధ దశమి శ్రవణ
నక్షత్రం కల్గి ఉన్న రోజును విజయ దశమి లేదా దసర గా భారత దేశం మొత్తం
జరుపుకొంటుంది. విజయ దశమి అంటేనే విజయాన్ని చేకూర్చిన, చేకూర్చే దశమి అని పెద్దలు చెబుతుంటారు.
ఈ విజయ దశమిని భారత దేశం
ఘనంగా జరుపుకుంటుంది. హిందూ పండుగలలో విజయ దశమికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పొచ్చు.
వారి వారిప్రాంతాలకు అనుగుణంగా ఈ పండుగను
జరుపుకుంటారు. పచ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమ్మవారి విగ్రహాలను అలకరించి ఘనంగా
పండుగ జరుపుకుంటారు.తెలంగాణాలో దసర
పండుగతో పాడు బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆచారం. అలాగే ఉత్తరాదిన రాముడు రావణున్ని
చంపింది కూడా ఈ రోజే అని నమ్ముతారు. అందుకని దానికి చిహ్నంగా రామ్ లీల పేరుతో
నాటకాలు ప్రదర్శిస్తారు.
చెడుపై మంచి గెలిచిందిఅనే దానికి నిదర్శనంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు.
ఒక మనిషికి ఎన్ని సుగుణాలు ఉన్నా ఒక దుర్గుణం అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది
అనడానికి విజయ దశమి కథని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
దుర్గా దేవి అలంకారముల
అంతరార్ధం:
శంఖం: జ్ఞానమనే శంఖాన్ని
పూరించి అజ్ఞాన నిద్రలో ఉన్న వారిని మేల్కొలిపిన దానికి గుర్తు.
చక్రం: స్వ (ఆత్మ) దర్శన
చక్రం అనగా నిరంతరం బుద్ధిలో సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని మననం చేయుటకు గుర్తు.
గద:పరమాత్మ స్మృతి అనే గదతో చెడు గుణాలను జయించిన
దానికి గుర్తు.
కమలం: సంసార సాగరంలో వుంటూ
ప్రపంచానికి అతీతంగా మరియు పరమాత్మకు ప్రియంగా అనే దానికి గుర్తు.
No comments:
Post a Comment