Thursday 17 December 2020

మీరు జియో సిమ్ వాడుతున్నారా... అయితే ఇది మీకోసమే...తస్మాత్ జాగ్రత్త ...-Do you have Jio SIM?

 




ఈ డిజిటల్ యుగంలో మోసాలు చేయడానికి మోసగాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక దారిని వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఈ డిజిటల్ విధానంలో పనులన్నీ మనం కూర్చున్న చోటినుండే పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానాన్నే సైబర్ నేరగాళ్ళు వాళ్లకు అనుకూలంగా వాడుకుంటున్నారు. క్రెడిట్ కార్డ్స్, ఆన్లైన్ పేమేంట్ల విషయంలో ఎక్కువగా ఈ సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు.


అయితే ఇప్పుడు జియో వినియోగదారులకు జరిగిన మోసానికి సంబంధించి తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది. జియో వినియోగదారులకు ఈ మోసగాళ్ళు జియో కస్టమర్ కేర్ నుండి ఫోన్ చేస్తున్నట్టు చెప్పి మీతో మాట్లాడతారు. వారి మాటలు మీరు నమ్మారంటే ఇక అంతే... మీ డబ్బులు పోయినట్టే.


ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు జియో వినియోగదారులకు ఫోన్ చేసి వెంటనే రీచార్జి చేసుకోవాలి లేదంటే మీ సిమ్ బ్లాక్ అవుతుంది అని భయపెడతారు. ఇది నమ్మి మీరు రీచార్జ్ కనుక చేస్తే మీ  డబ్బులు పోయినట్టే. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు కస్టమర్ కేర్ నుండి ఫోన్ చేసినట్టు నమ్మించి, రిమోట్ యాక్సిస్ ద్వారా ఈ రీచార్జిని చేసుకోవాలని సూచిస్తారు. ఈ రిమోట్ యాక్సిస్ ద్వారా రీచార్జ్ చేసుకోగానే, ఆ యాప్ ద్వారా మీ ఖాతాలో డబ్బులు సైబర్ నేరగాళ్ళు నొక్కేస్తారు.


మన దేశంలో జియో వినియోగదారులు చాలా ఎక్కువ అన్న విషయం తెలిసిందే. అందుకోసం ఈ సైబర్ నేరగాళ్ళు జియో వినియోగదారులను టార్గెట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ బిజీగా గడుపుతున్న మనం కొన్నిసార్లు మనకొచ్చే ఫోన్ కాల్స్ ని నమ్మి మనకు తెలియకుండానే కొన్ని తప్పులను చేస్తున్నాం. ఇదే సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారిందని చెప్పొచ్చు.


ఈ విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరిగి ఇలాంటి మోసాలు జరగకండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే వినియోగదారులు కూడా తమకు వచ్చే కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, గుడ్డిగా ఎవరిని నమ్మవద్దని సూచిస్తోంది.


No comments:

Post a Comment