Tuesday, 19 January 2021

వెనక్కి తగ్గిన వాట్సాప్... వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్...

 





ప్ర్రతీ యూజర్ కి పర్సనల్ గా స్టేటస్ ద్వారా క్లారిటీ ఇచ్చిన వాట్సాప్…

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా అప్డేట్స్ తో ముందుకు వస్తోంది వాట్సాప్.  దీనితో వాట్సాప్ యూజర్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. కానీ గత కొద్ది రోజులుగా వాట్సాప్ యూజర్ల ఆగ్రహానికి గురవుతోంది. దానికి కారణం వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ. మొదటి నుండి వాట్సాప్ యూజర్ల డేటా గురించి తగిన ప్రైవసీ కల్పిస్తూ వస్తోంది.

కానీ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన ప్రైవసీ పాలసీ యూజర్ల ఆగ్రహానికి గురైంది. 8 ఫిబ్రవరి లోపు యూజర్లు తమ కొత్త ప్రైవసీ విధానాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. లేదంటే ఆయా యూజర్ల ఖాతాను తొలగించడం జరుగుతుంది అని ప్రకటించింది. అసలు ఆ ప్రైవసీ పాలసీ ఏంటంటే వాట్సాప్ తమ యూజర్ల డేటా ని తన మాత్రు సంస్థ అయిన ఫేస్ బుక్ తో పంచుకుంటుంది. అంటే యూజర్ వాట్సాప్ ఖాతా తెరిచే ముందు ఇచ్చే సమాచారం అంతా ఫేస్ బుక్ తో పంచుకోవడం జరుగుతుంది.  

అంటే మీ మొబైల్ నంబర్, మీ లొకేషన్, మీకు సంబందించిన ఇతర సమాచారాన్ని వాట్సాప్ తన మాత్రు సంస్థ ఫేస్ బుక్ తో పంచుకోనుంది. అలాగే ఫేస్ బుక్ కి సమబందించిన ఇతర ప్రొడక్ట్స్ తో కూడా పంచుకోనుంది. ఈ యూజర్ కి సంబందించిన  సమాచారాన్ని గోప్యంగా ఉంచే విషయంలో యూజర్లు ఆగ్రహంగా ఉన్నారు. తమకు సంబందించిన సమాచారాన్ని ఇలా పంచుకోవడం వల్ల తమ ప్రైవసీ కి భంగం కలిగినట్టే అని  యూజర్లు ఆగ్రహంగా ఉన్నారు..

ఈ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల యూజర్లు కొత్త కొత్త యాప్ ల వైపు చూస్తున్నారు. వాట్సాప్ కి పోటీగా చాలా వచ్చినా వాట్సాప్ ముందు నిలబడలేక పోయాయి. కానీ ఈ కొత్త ప్రైవసీ వల్ల యూజర్లు వాట్సాప్ కి బై బై చెబుతున్నారు. ఇది గమనించిన వాట్సాప్ కొన్ని రోజులు ఈ కొత్త ప్రైవసీ విధానాన్ని వాయిదా వేస్తున్నట్టు తన బ్లాగర్ లో  ప్రకటించింది.

మా కొత్త ప్రైవసీ విధానం వల్ల యూజర్ల సమాచార గోప్యత గురించి యూజర్ల అనుమానాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ప్రైవసీ విధానాన్ని అమలు చేసే విషయాన్ని  కొన్ని రోజుల వరకు పొడిగిస్తున్నట్టు వాట్సాప్  సంస్థ తన బ్లాగ్ లో ప్రకటించింది.

అంటే ఫిబ్రవరి 8 తరువాత  మీ  వాట్సాప్ అకౌంట్ పని చేస్తుంది. దీన్ని మే 15 వరకు పొడగించడం జరిగింది. అయితే ఇప్పుడు వాట్సాప్ కొత్త ప్రైవసీ వల్ల యూజర్లలో ఉన్న ఆందోళనలను తొలగించే ప్రయత్నం చేస్తోంది.  ఇప్పటికే చాలా యూజర్లు వాట్సాప్ తరహా యాప్స్ లోకి జంప్ అవుతున్నారు. ఇలా జంప్ కాకుండా ఉండాలంటే ప్రస్తుతం కొత్త ప్రైవసీ ని వాయిదా వేయడం మంచిదని వాట్సాప్ యాజమాన్యం భావించినట్టు తెలుస్తోంది.

దీనితో పాటు కొత్తగా వాట్సాప్ స్టేటస్ లో యూజర్స్ కోసం ప్రత్యేకమైన మెసేజ్ ని ఉంచింది.



మీ ప్రైవసీ కాపాడేందుకు కట్టుబడి ఉన్నాము.

మీ పర్సనల్ చాట్స్ లను  వాట్సాప్ చదవదు… వినదు. అవెప్పుడు ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి.

మీరు షేర్ చేసిన లొకేషన్ ని వాట్సాప్ చూడదు.

వాట్సాప్ మీ కాంటాక్ట్స్ ని ఫేస్ బుక్ తో పంచుకోదు.

ఇలా వాట్సాప్ యూజర్లను బుజ్జగించే పనిలో పడింది. ఇప్పటికే వాట్సాప్ చాలా మంది యూజర్లను కోల్పోయిందని చెప్పొచ్చు.

No comments:

Post a Comment