Wednesday 20 January 2021

Xiaomi republic day sale...అన్ని రకాల mi బ్రాండ్స్ పై భారీ డిస్కౌంట్…

 




ఇండియాలో  రిపబ్లిక్ డే ని పురస్కరించుకొని షియోమీ రిపబ్లిక్ డే సేల్ ని ప్రకటించింది. తన సొంత వెబ్సైట్ మి.కామ్ లో ఈ సేల్ ని నిర్వహిస్తోంది. దీనితో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో కూడా ఈ రిపబ్లిక్ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ ఈ రోజు  జనవరి 20 నుండి 24 తేదీల వరకు జరగుతుంది. అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్ కార్ట్  విఐపి, మి విఐపి  సభ్యులకు నిన్నటి నుండే ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. సభ్యులు కానీ వారికి ఈ రోజు నుండి ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.


ఈ రిపబ్లిక్ సేల్ లో ముఖ్యం గా రెడ్‌మి 9 ప్రైమ్, రెడ్‌మి నోట్ 9 సిరీస్ మరియు రెడ్‌మి 9 ఐ  తగ్గింపు ధరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రిపబ్లిక్ డే సేల్ లో మి స్మార్ట్ బ్యాండ్ 4, రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్, రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్, మి వాచ్ రివాల్వ్, మి టివి స్టిక్, మి స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అలాగే మరిన్ని ఉత్పత్తులపై తగ్గింపు ధరలతో, డిస్కౌంట్లతో కనిపిస్తాయి.


అలాగే అదనంగా యాక్సిస్ బ్యాంక్ 10% డిస్కౌంట్ ని కూడా అందిస్తోంది. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, అలాగే మరి కొన్ని ప్రొడక్ట్స్ పై ఈ డిస్కౌంట్ ని అందిస్తోంది.


రెడ్‌మి 9 ఐ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 8,299,  కానీ ఈ సేల్ లో రూ. 7,999 కి లభించనుంది.


మరోవైపు రెడ్‌మి 9 ప్రైమ్ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 500 డిస్కౌంట్ తో రూ. 9,499 లభించనుంది.


ఈ రిపబ్లిక్ డే సేల్ లో రెడ్‌మి నోట్ 9 6 జిబి + 128 జిబి స్టోరేజ్ మోడల్‌ రూ. 1000 డిస్కౌంట్ తో రూ. 13,999 కు లభించనుంది.


రెడ్‌మి నోట్ 9 ప్రో 4 జీబీ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 13,999 కి లభించనుంది. ఈ మోడల్  పై రూ. 2000 డిస్కౌంట్ లభించనుంది.


రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ 6 జిబి + 64 జిబి స్టోరేజ్ మోడల్ రూ. 1000 డిస్కౌంట్ తో రూ. 17,499 కి లభించనుంది. అలాగే ఎక్స్చేంజ్ ద్వారా అదనంగా రూ.2000 డిస్కౌంట్ లభించనుంది.


మి ఎల్ ఇ డి టీవీలు కూడా డిస్కౌంట్ ధరలకు లభించనున్నాయి.



ఇతర వివరాల కోసం https://www.mi.com/in ని వీక్షించండి.

No comments:

Post a Comment