Saturday, 9 January 2021

పెరుగుతున్న కొత్త కరోనా కేసులు…

 





సార్స్ తరహా కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మనదేశంలో 82 కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఈ నెల 6 నాటికి 78 గా ఉన్న కేసులు, శుక్రవారానికి 82 కి పెరిగాయని పేర్కొంది. ఈ వైరస్ సోకిన వారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక జాగ్రత్తలతో క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపింది . వారితో సంబంధాలు కలిగిన వారిని , సహ ప్రయాణికులు , కుటుంబ సభ్యులు , ఇతరుల కోసం సమగ్ర కాంటాక్ట్- ట్రేసింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించింది . మెరుగైన నిఘా , నియంత్రణ , పరీక్ష , నమూనాలను ప్రయోగ శాలలకు పంపించడం కోసం రాష్ట్రాలకు క్రమం తప్పకుండా సలహాలు ఇస్తున్నట్లు తెలిపింది . 19 వేల దిగువకు చేరిన కరోనా కేసులు దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య ఈ నెలలో ఐదోసారి 19 వేలు కన్నా దిగువకు చేరాయి .


18,139 కొత్త కేసులు , 234 మరణాలు నమోదయ్యాయి . ఈ నెల 7 న కొత్తగా నమోదైన 9,35,369 సహా 17,93,36,364 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసిఎంఆర్ ) తెలిపింది . కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయండి : ఆ నాలుగు రాష్ట్రాలకు కేంద్రం సూచన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నాలుగు రాష్ట్రాలకు నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది.కరిన నిబంధనలు అమలు చేయాలని , సత్వర చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర , కేరళ , చత్తీస్ గఢ్ , బెంగాల్ ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు . దేశంలో వెలుగు చూస్తున్న కేసులలో ఈ నాలుగు రాష్ట్రాల నుండి 59 శాతం కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు .

No comments:

Post a Comment