వాట్సప్ యాప్ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారుల సమాచారానికి భద్రత లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వినియోగదారులు కొత్త నిబంధనలకు అంగీకరిస్తూ యాప్ ను అప్ డేట్ చేసుకోవాలంటూ వాట్సప్ గురువారం ప్రకటించింది. కొత్త నిబంధన ప్రకారం వాట్సప్ వాడుతున్న వినియోగదారుల వ్యక్తిగత డేటాను వాట్సాప్ పేరేంట్ కంపెనీ అయిన ఫేస్ బుక్ వాడుకుంటుంది. ఈ సమాచారాన్ని వాడుకొని ఈ కామర్స్ బిజినెస్ చేసుకుంటుంది. ఒకవేళ కొత్త నిబంధనలకు అంగీకారం తెలపకుంటే వారికి వాట్సాప్ సేవలు అందుబాటులో ఉండవని కూడా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ రెండు వందల కోట్ల వినియోగదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కొత్త నిబంధన బ్రిటన్, యూరోపియన్ యూనియన్లలో మొదట అమలు చేస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందంటూ నెటిజన్లు, హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారుల ఆగ్రహం…. ఇంటర్నెట్ వినియోగ దారుల అసోసియేషన్ లా క్వాడ్రేచర్ డునెట్ న్యాయవాది మాట్లాడుతూ.. ఈ మార్పులను తిరస్కరించాలంటే ఒక్కటే మార్గం వాట్సప్ ను వినియోగించకుండా ఉండటమేనని అన్నారు. యాప్ ను అనుమతిస్తే చట్ట విరుద్ధంగా వినియోగదారుల డేటా చోరీకి లైసెన్స్ ఇచ్చినట్టవుతుందన్నారు. ఈ నిబంధన వినియోగదారుల డేటాకు భద్రత కల్పించడం లేదు కాబట్టి వాట్సపు వదిలి సిగ్నల్ లాంటి యాప్ కు మరలడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలామంది వాట్సపు గుడ్ బై చెప్పి సిగ్నల్ యాపను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. మరోవైపు ప్రపంచ కుబేరుడు, టెల్సా అధినేత ఎలెన్ మాస్క్ కూడా వాట్సప్ ను వదిలేసి సిగ్నల్ లాంటి యాప్లను వాడాలంటూ ట్వీట్ చేశారు. యూరోపియన్ యూనియన్ కూడా వాట్సప్ నుంచి సిగ్నల్ కు మారాలని నిర్ణయించింది. గతేడాది మేలో పలు మంత్రిత్వ శాఖలు, సంస్థలను వాట్సప్ వినియోగించవద్దని జర్మనీ డేటా గోప్యతా కమిషనర్ ఉర్రిచ్ కెల్బర్ సూచించారు. పోటీ తత్వానికి సంబంధించిన చట్టాలను ఉల్లంఘిం చడంతో పాటు సోషల్ మీడియా మార్కెట్ పై గుత్తాధిపత్యం చెలాయి స్తోందంటూ డిసెంబర్ లో యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ , 48 రాష్ట్రాలు ఫేస్ బుక్ పై పిటిషన్ వేశాయి.
No comments:
Post a Comment