Thursday 21 January 2021

ఎవరూ తగ్గడం లేదు… ఆందోళనలో బీజేపీ ప్రభుత్వం

 





ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య బుధవారం జరిగిన పదోవిడత చర్చలు ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిశాయి . దీనితో 22 వ తేదీన మళ్లీ చర్చలు జరపాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి . మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు నిలిపివేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇంకా ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు చట్టాలపై చర్చ జరిగేందుకు ఒక సంయుక్త సంఘాన్ని ఏర్పాటుచేస్తామని కూడా తెలిపింది . కానీ , రైతు నాయకులు మాత్రం ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే అంగీకరించలేదు . దీని గురించి తాము అంతర్గత సమాలోచన జరిపిన తర్వాత ఏ విషయం అనేది చెప్తామని పేర్కొన్నారు .


గురువారం రైతు సంఘాలు అంతర్గత చర్చలు జరుపుతాయి . మొత్తానికి రెండు విరామాలతో కలుపుకొని దాదాపు ఐదు న్నర గంటలపాటు 10 వ విడత జరిగాయి. “ సాగు చట్టాలను ఏడాదిన్నరపాటు నిలిపివేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతిపాదన ప్రభుత్వం నుంచి వచ్చింది కనుక మేం దీనిని తిరస్కరించాం . దీని గురించి చర్చించేందుకు గురువారం సమావేశం కానున్నాం ” అని భారతీయ కిసాన్ యూనియన్ ( ఉగ్రహన్ ) అధ్య క్షుడు జోగీందర్ సింగ్ ఉగ్రహన్ అన్నారు . పర స్పర అంగీకారం కుదిరిన సమయం వరకు చట్టా లను నిలిపివేస్తామని , ఇంకా ఒక కమిటీని నియమిస్తామన్న వివరాలతో సుప్రీం కోర్టులో ఒక అఫి డవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించిందని మరో రైతు నాయకురాలు కవితా కురు గంటి పేర్కొన్నారు . మొత్తానికి చట్టాల రద్దు డిమాండ్ విషయంలో రైతు సంఘాలు తమ అభిప్రాయాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. కానీ ప్రభు త్వ ప్రతిపాదన గురించి చర్చించి , తర్వాత సమావేశంలో తమ చివరి నిర్ణయాన్ని తెలుపుతామని రైతు నాయకులు తెలిపారు .


మరో ఆశ కనిపించడం లేదు….. రైతు సంఘాలతో బుధవారం నాటి చర్చల్లో మూడు వ్యవసాయ చట్టాలను సవరిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది . కానీ రైతు నాయకులు మాత్రం చట్టాలు రద్దు చేయాలన్న డిమాండ్ కు అంటిపెట్టుకున్నారు. ఇంకా కేంద్రం కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీపై చర్చలను పక్కన పెడుతోందని వారు ఆరోపించారు. మూడు వ్యవసాయ చట్టాలపై రెండు పక్షాలూ బిగుసుకుని కూర్చోవడంతో మొదటి సెషన్లో ఎలాంటి ఫలితం తేలలేదని రైతు నాయకులు పేర్కొన్నారు. మొత్తానికి 11 వ విడత చర్చలకు ఒక తేదీని నిర్ణయించడం మినహా మరో ఆశ ఏదీ కనిపించడం లేదని చెప్పారు.అయితే ఒక నిర్దిష్ట సమయం వరకు చట్టాల అమలును నిలిపివేసేందుకు , ఇంకా రైతు సంఘాల నాయకులు , ప్రభుత్వ ప్రతినిధులతో ఒక కమిటీని నియమిస్తామని కూడా ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం. ఆ కమిటీ నివేదిక ఇచ్చేవరకు చట్టాలు అమలు కావని, అప్పటి వరకు రైతు సంఘాలు కూడా తమ ఆందోళన విరమించుకోవాలని మంత్రులు ప్రతిపాదించనట్లు తెలుస్తోంది . అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్టేవిధించింది . ప్రతిష్టంభన తొలగించేందుకు ఒక కమిటీని కూడా నియమించింది . మంగళవారం తొలి సమావేశం జరిపిన ఆ కమిటీ గురువారం నుంచి రైతులు, ఇతరుల తో సంప్రదింపులు జరపనుంది . రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఈ కమిటీకి గడువు ఇచ్చింది . ఎస్ఇఎ నోటీసులు పరిశీలిస్తాం ఇక జాతీయ దర్యాప్తు సంఘం ( ఎస్ఎఎ ) కొంతమంది రైతులకు నోటీసులు జారీచేసిన విషయాన్ని కూడా రైతు నాయకులు చర్చల్లో లేవనెత్తారు . ఇదంతా నిరసనకు మద్దతు ఇస్తున్నవారిని వేధించే ప్రయత్నమేనని ఆరోపించారు . అయితే ఈ విషయాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వ ప్రతినిధులు బదులిచ్చారు .

No comments:

Post a Comment