కొడుకుని ముఖ్యమంత్రిని చేయటానికి సిఎం కెసిఆర్ అనారోగ్యాన్ని సాకుగా చూపాలా. సిఎం కెసిఆర్ కెటిఆర్ ను సిఎంని చేస్తారో, మరోకరిని చేస్తారో అది ఆయన పార్టీ అంతర్గత విషయమని , కానీ బిజెపి దెబ్బలకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తే సంతోషిస్తాం . కెటిఆర్ క్యాబి నెలో మంత్రి పదువుల కోసం టిఆర్ఎస్లో కొట్లాట జరుగుతోందట . మంత్రివర్గంలోకి తీసుకోకుంటే సొంత పార్టీ ఏర్పాటుకు ముగ్గురు ఎంఎల్ ఎలు ప్రణాళిక రచిస్తున్నారని సమాచారం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
సిఎం కెసిఆర్ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన దగ్గర తాను మంచి భాష నేర్చుకోవాలని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యాక్రమంలో ఆలేరు నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీ లకు చెందిన నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరా రు. కార్యక్రమంలో బిజెపి నేతలు మోత్కుపల్లి నరసింహులు, బండ్రు శోభా రాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడు తూ ప్రజలు కెసిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసింది ఫామ్ హౌస్లో పడుకునేం దుకు కాదని, కెసిఆర్ షెడ్యూల్ ఏమిటో కూడా తెలియదని, అర్ధ రాత్రి నిర్ణ యాలు తీసుకుంటారని, పొద్దునే యూ టర్న్ తీసుకుంటారని ఆయన విమ ర్శించారు. ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారని, మరోవైపు సిఎం కెసిఆర్ తీసుకునే చెత్త నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేటు టీచర్ లెక్చరర్లకు ప్రభుత్వం అండగా ఉండేందుకు ఒక పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారని, కెసిఆర్ మాత్రం పట్టించుకోవడం లేద న్నారు. ప్రభుత్వం చేపట్టే పనులకు టెండర్లు పూర్తి కాకముందే నాణ్యత లే కుండా పనులు చేస్తున్నారన్నారని, టిఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టుల కోసం, బ్రోకర్ల కోసం పని చేస్తుందని ఆయన ఆరోపించారు.
సిఐ స్థాయి అధికారి దగ్గర కూడా సిఎంఓ అధికారులు కమిషన్లు గుంజుకుంటున్నారని ఆరో పించారు. కరెప్షన్ అనే వ్యాక్సిన్ ను ప్రజల సహకారంతో సిఎం కెసిఆర్ పైనే ప్రయోగిస్తామన్నారు. పిఆర్సి, వయోపరిమితిపై సిఎం కెసిఆర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని, ఏపిలో పని చేస్తున్న నాలుగో తరగతి తెలంగాణ ప్రాంత ఉద్యోగులను స్వరాష్ట్రానికి వెంటనే తీసుకురావాలన్నారు. హాఫీజ్ పేట భూముల వ్యవహారంలో కెసిఆర్ బంధువులపై ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్య మంత్రిగా కెసిఆర్ స్పందించాలన్నారు. తమను కుక్కలని మాట్లాడుతున్నారని, కుక్కలకు విశ్వాసం ఉంటుందని, వాళ్ళకు అది కూడా లేదన్నారు.
No comments:
Post a Comment