Sunday, 17 January 2021

మాస్ మహా రాజా రవితేజ “క్రాక్” ఓటీటీ లో త్వరలో విడుదల... ఎప్పుడో తెలుసా...

 


Image Source: Google


ఈ  సంక్రాంతి మాస్ మహారాజా రవితేజ కి బాగా కలిసొచ్చింది. ఒక్కసారిగా  టాలీవుడ్ మొత్తం రవితేజ సినిమా వైపే చూస్తోంది. చాలా రోజులనుండి రవితేజ హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ టైం లోనే తనకు రెండు సినిమాలు హిట్ ని అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని తో క్రాక్ సినిమా తీసాడు. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా విడుదల కాలేదు. ఒకానొక సమయంలో ఈ సినిమాని  ఓటీటీ లో విడుదల చేయాలనే ఆలోచన కూడా వచ్చింది. ఎందుకంటే అప్పటికే చాలా సినిమాలు ఓటీటీ లో విడుదల అయ్యాయి.


కరోనా ప్రభావం తగ్గడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండటం తో సినిమా థియేటర్లను తెరవడం జరిగింది. దీనితో క్రాక్ సినిమా ని సంక్రాంతి బరిలోకి దించారు. ఈ సినిమా స్టార్ సినిమా విడుదలకు మార్గం సుగమం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా నాలుగేళ్ల నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజా కి తన కెరియర్ లో ఇంకొక హిట్ ని సొంతం చేసుకున్నాడు. విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. విడుదలైన 6 రోజుల్లోనే 20 కోట్ల షేర్ వసూలు చేసి హిట్ ట్రాక్ ఎక్కాడు రవితేజ. కరోనా నేపథ్యం లో థియేటర్స్ సగం సీట్లకే అనుమతి ఉండటంతో కలెక్షన్లు తగ్గాయని, థియేటర్స్ ఫుల్ ఆక్యుపెన్సీ తో సినిమా షోలు పడితే రవితేజ కి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం అయ్యేదని సినీ విమర్శకుల మాట.



అయితే ఈ క్రాక్ సినిమా కలెక్షన్లకు గండి పడే అవకాశం ఉందని రూమర్ మొదలైంది. ఎందుకంటే క్రాక్ సినిమాని త్వరలో ఓటీటీ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. దీనికి ముందు విడుదలైన సాయి ధరమ్ తేజ్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాని కూడా ఇలాగే జీ 5 వాళ్ళు విడుదలైన వారానికే  జనవరి  1 న న్యూ ఇయర్ సందర్భంగా ఓటీటీ లో విడుదల చేసారు. దానితో ఆ సినిమా కలెక్షన్లకు గండి పడింది. ఇప్పుడు క్రాక్ సినిమా కి ఇదే పరిస్థితి ఎదురు కానుందా అని రవితేజ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. క్రాక్ సినిమా  నిర్మాతలు విడుదలకు ముందే తెలుగు  ఓటీటీ సంస్థ “ఆహా” కి ఓటీటీ రైట్స్ అమ్మడం జరిగింది.  అల్లు అరవింద్ ఆహా సంస్థ భారీగా రూ. 8 కోట్లు పెట్టి ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేసింది. క్రాక్ సినిమా మంచి విజయాన్ని  సాధించడంతో “ఆహా” సంస్థ ఆ క్రేజ్ ని ఉపయోగించుకోవాలనుకొంటోంది.


గోపీచంద్ మలినేని  క్రాక్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను అత్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు అందుతున్నాయి. ఎస్. తమన్ బ్యాక్  గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ అని అంటున్నారు.  రవి తేజ సరసన బలుపు తరువాత శ్రుతిహాసన్ రవి తేజ తో మరోసారి జత కట్టింది. అలాగే శ్రుతి హాసన్ ఈ సినిమాతో తెలుగలో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో శృతి హాసన్ తెలుగులో మళ్ళీ బిజీ అవుతుందని సినీ పండితులు చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో మరొక పాత్ర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే వర లక్ష్మి శరత్ కుమార్. ఈ సినిమాలో వరలక్ష్మి తన నటనతో ఆకట్టుకుందని చెప్పొచ్చు.


Image Source: Google


ఏది ఏమైనా కానీ ఓటీటీ లో విడుదల అవ్వడం వల్ల థియేటర్స్ కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూర్చొని చూసినా, క్రాక్ సినిమా నిర్మాతలకు మాత్రం కొంచం నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇదంతా తెలియాలంటే అల్లు అరవింది ఆహా సంస్థ ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

“ఆహా” సంస్థ మంచి మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు రూమర్ విన్పిస్తోంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26 వ తేదీన “ఆహా” లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిస్తున్నాయి. ఇదే గనక జరిగితే క్రాక్ సినిమా కలెక్షన్లకు గండి పడ్డట్టే. అయితే ఇంకొక వార్త కూడా వినిపిస్తోంది. అదేంటంటే క్రాక్ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యాక మాత్రమే ఈ సినిమా ఓటీటీ లో విడుదల అవుతుందని చెబుతున్నారు.

No comments:

Post a Comment