Monday, 11 January 2021

ట్రంప్ ను ఘోరంగా ఆవమానిచేందుకు భారీ స్కెచ్

 





మరో పది రోజుల్లో అధికారంగా అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సిన డొనాల్డ్ ట్రంప్ గౌరవపూర్వంగా బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. అతనిపై ముప్పేట దాడికి డెమోక్రాట్లు రంగం సిద్ధం చేసుకోగా, రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నేతలు వారికి మద్దతు నిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద సొంత పార్టీలోనే ట్రంప్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. రిపబ్లికన్ పార్టీకే చెందిన పలువురు కీలక నేతలు ఆయన వ్యవహార శైలి గురించి, ప్రత్యేకించి కాపిటోల్ పై ఆయన మద్దతుదారుల దాడి గురించి చర్చించుకుంటున్నారు.


ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్నది డెమోక్రాట్ల వ్యూహం. రిపబ్లికన్ పార్టీకి చెందిన సభ్యులు మద్దతునిస్తే , ట్రంప్ అత్యంత అవమానకమైన పరిస్థితుల్లో వైట్ హౌస్ను వీడాల్సి ఉంటుంది. ట్రంప్ శిక్షార్హుడేనని కొంత మంది వ్యాఖ్యానించడం గమనార్హం. అదే విధంగా, ట్రంప్ కారణంగా భవిష్యత్తులో పార్టీ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది. అత్యంత కీలకమైన అభిశంసన తీర్మానాన్ని ఆమోదింపచేయడం ద్వారా, అవమానకరమైన రీతిలో ట్రంప్ ను సాగనంపడానికి డెమోక్రాట్ పార్టీ అన్ని విధాలా సన్నాహాలను పూర్తి చేసింది.


అమెరికా చట్టసభలో, అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానాన్ని ఉంచి, అది నెగ్గేలా చూడడం అన్నది ఆషామాషి వ్యవహారం కాదు . అయితే, భవిష్యత్తులో ఎప్పుడూ దేశాధ్యక్షుడిగా పోటీ చేయకుడా ట్రంప్ ను నిరోధించడమే డెమోట్రాట్ల లక్ష్యంగా కనిపిస్తున్నది. అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేయడానికి జో బైడెన్ సిద్ధంగా ఉన్నారు. ట్రంప్ చేసిన పొరపా ట్లను, ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సభికుల ముందు ఉంచి, తన వాదన నెగ్గేలా చూసేందుకు బైడెన్ వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు . ట్రంప్ పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేక వ్యక్తమవుతున్న నేపథ్యంలో, డెమోక్రాట్ల ఎత్తుగడ ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా వుంటే , అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకున్న పలునిర్ణయాలను సమీక్షించి , అవసరమైతే వాటిని రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్న బైడెన్, ఈ వ్యూహం ద్వారా రిపబ్లికన్ పార్టీని దెబ్బతీయాలన్నది డెమోక్రాట్ అభ్యర్థిగా ఎన్నికైన బైటెన్ లక్ష్యం. మొత్తం మీద మొదటి నుంచి దుందుడుకు స్వభావంతో విమర్శలకు గురైన ట్రంప్ , కాపిటోల్ దాడి తర్వాత తన ప్రతిష్టను మరింతగా దిగజార్చుకున్నాడు . చివరికి సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు.


 కాపిటీల్ దాడి నేపథ్యంలో ట్రంప్ ముమ్మాటికీ శిక్షార్హుడే నని , ఆయనపై అభిశంసన తీర్మానాన్ని పెట్టడం తప్పేమీ కాదని రిపబ్లికన్ పార్టీ నాయకులే వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది . అయితే డెమోక్రాట్లు ఆశిస్తున్నట్టు ట్రంప్ ను అభిశంసన తీర్మానాన్ని ఆమోదింప చేసుకొని సాగనంపడం అనుకున్నంత సులభం కాదు . సవాలక్ష అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది . చట్టసభల్లో తన వాదన వినిపించే అవకాశం ట్రంపు ఉంటుంది . అంతేగాక , అత్యున్నత న్యాయ స్థానంలో కూడా ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించునే ప్రయత్నం చేయవచ్చు. ఈ అంశాలను పరిశీలిస్తే , ట్రంప్ ను బలవంతంగా సాగనంప డానికి సరిపడా సమయం డెమోక్రాట్ బైడెన్‌కు లేదు.అందుకే వివిధ అంశాలను లేవనెత్తి, ట్రంపను పలు రకాలుగా దోషిగా చూపించి, తద్వారా ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికే బైడెన్ బృందం ప్రయత్నించడం ఖాయం . దేశాధ్యక్షుడి పదవీ బాధ్యతలు స్వీకరిం చడానికి ముందే ట్రంప్ ను దేశ ప్రజల ముందు దోషిగా నిలబెట్టి , ఆతర్వాత తన పాలనకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా బైడెన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ట్రంప్ మీద మొదలైన ముప్పేట దాడి ఆయనతోపాటు మొత్తం రిపబ్లికన్ పార్టీనే సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారుల వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.

No comments:

Post a Comment