Wednesday 25 March 2020

అన్ని టాక్స్ రిటర్న్స్‌కి చివరి తేదీ జూన్ 30, 2020: ITR, Aadhaar-PAN linking, GST filing deadlines extended


కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతా రామన్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు.

అన్ని టాక్స్  రిటర్న్స్‌కి చివరి తేదీ జూన్ 30, 2020.

 


కరోనా ప్రభావంతో  దేశం మొత్తం లాక్ డౌన్ అయిన సందర్భంలో, నిర్మల సీతా రామన్ ఆర్ధిక పరమైన కొన్నికీలక ప్రకటనలు చేయడం జరిగింది.

1. ఇన్‌కం  టాక్స్ రిటర్న్  2018-2019 సంవత్సరానికి గాను సబ్‌మిట్  చేసే చివరి తేది ఈ నెల మార్చి 31. .దీన్ని ఇప్పుడు జూన్ 30 2020 తేదీ వరకు పొడగించారు.

2. జిఎస్‌టి రిటర్న్స్  సబ్‌మిట్ చేసే చివరి తేదీ మార్చి 31, దీన్ని కూడా జూన్ 30, 2020 కి పొడిగించారు.

3. పాన్ కార్డ్‌ని  ఆధార్‌తో లింక్ చెసే తేదీని కూడా జూన్ 30, 2020 వరకు పొడిగించారు.

4. బ్యాంక్ అకౌంట్‌లో మినిమం బ్యాలన్స్‌ను ఉండాలన్న నిబంధనను ప్రస్తుతానికి  తొలగించారు. ఎటువంటి  చార్జీలు వర్తించవు.

5.  మీ ఏటీయం  కార్డ్ ద్వారా ఏ బ్యాంక్ నిండైనా డబ్బులు తీసుకోవొచ్చు. దీనికిగాను ఎటువంటి చార్జీలు వర్తించవు.

No comments:

Post a Comment