Tuesday 24 March 2020

తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించే అవకాశం


తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించే అవకాశం. 

తెలంగాణలో కరోనా పాసిటివ్ కేసులు 33 కు చేరుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలో  మార్చి 31 వరకు లాక్ డౌన్ విధించినప్పటికి  ప్రజలు ఆ విషయాన్ని పెద్ద సిరియస్‌గా తీసుకోకుండా ఇళ్ళ బయటకు వచ్చి మాములు రోజుల్లొ బయట తిరిగినట్టు తిరుగుతుండటంతో ప్రభుత్వానికి కరోనాని అరికట్టే మార్గానికి కొంచెం ఇబ్బంది కలుగుతోంది.   దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించినా  కొంతమంది ఏదో ఒక విధంగా రోడ్లపై తిరుగుతున్నారు.  ఈ విషయంలో పోలిసులు కూడా కొంచెం కఠినంగానే వ్యవహరిస్తున్నారు.

ఈరోజు మద్యహ్నం ముఖ్యమంత్రి కెసీఅర్, అత్య్వసర సమావేశాన్ని ఎర్ప్పాటు చేసి, పరిస్థితిని సమీక్షించి, కలెక్టర్లతో కరోనా వైరస్‌ని   అరికట్టే విధానాల గురుంచి వీడియో కాంఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు.   

అయితే ప్రజలు లాక్ డౌన్ ని సిరియస్‌గా  తీసుకోవట్లేదని భావించి హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించే అవకాశం ఉందని  తెలుస్తోంది.           

No comments:

Post a Comment