Thursday 23 April 2020

JIOలో FACEBOOK భారీగా పెట్టుబడి

జియోలో ఫేస్‌బుక్ భారీగా పెట్టుబడి.



ఫేస్‌బుక్ తన వ్యాపారాన్ని భారత్‌లో  పెంచుకునే భాగంగా, రిలయన్స్ జియోలో భారీగా పెట్టుబడి పెట్టింది. మొత్తం 5.7 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 43, 574 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఫేస్‌బుక్ బుధవారం ప్రకటించింది. ఈ పెట్టుబడితో 9.9 శాతం వాటాను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది.  

ఈ పెట్టుబడి తరువాత  మొత్తం జియో ప్లాట్ ఫాంస్ విలువ రూ. 4.62 లక్షల కోట్లు. ఈ పెట్టూడి దేశంలోని టెక్నాలజీ రంగంలోనే అతి పెద్ద ఎఫ్‌డీఐ అని రిలయన్స్ సంస్థ  తెలిపింది.

ముఖేష్ అంబాని మట్లాడుతూ, జియోలోకి ఫేస్‌బుక్ పెట్టుబడులను స్వాగతిస్తున్నాం, ఇండియాను అతిపెద్ద డిజిటల్ సమజంగా నిలిపేందుకు జియో ఫేస్‌బుక్ భాగస్వామ్యం దోహదపడుతుందని ఆశిస్తున్నాం.  త్వరలోనే జియో మార్ట్ వాట్సాప్‌ల 3 కోట్ల చిన్న కిరాణాలను పూర్తిగా డిజిటలైజ్ చేసి, డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు ప్రోత్సాహం అందివ్వబోతున్నాం . దీని ద్వారా మీ సమీపంలోని కిరాణాల నుండి రోజూ వారీ సరుకులను తెప్పించుకోవచ్చు అని ఆయన చెప్పారు.      

త్వరలోనే జియో మార్ట్‌, వాట్సాప్‌ల ద్వారా 3 కోట్ల చిన్న కిరాణాలను డిజిటలైజ్ చేసి పుర్తిగా డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు ప్రోత్సాహం అందివ్వనున్నాం. దీని ద్వారా మీ సమీపంలోని కిరాణాల నుంచి రోజు వారీ సరుకులు తెప్పించుకోవచ్చు.

No comments:

Post a Comment