Tuesday 21 April 2020

బాబాయి బాలయ్యతో పాటు ముగ్గురు సీనియర్ హీరోలకు చాలెంజ్ విసిరిన జూ.ఎన్ టి ఆర్.

బాబాయి బాలయ్యతో పాటు ముగ్గురు సీనియర్ హీరోలకు ఛాలెంజ్ విసిరిన జూ.ఎన్ టి ఆర్.     


కరోనా ఎఫెక్ట్ వల్ల దేశంలో లాక్‌డౌన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల సినిమా షూటింగులు ఆగిపోయి అందరు స్టార్స్ వాళ్ళ ఇళ్ళకే పరిమితమయ్యారు. 

దీంతో అందరు తమ ఫ్యాన్స్‌తో ఏదో రకంగా టచ్‌లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ సినిమాలకు సంభందించిన అప్‌డేట్స్ తక్కువగా అందుబాటులో ఉన్నాయి.   కాబట్టి చిన్న హీరో దగ్గరినుండి పెద్ద పెద్ద స్టార్స్, డైరెక్టర్లు వాళ్ళు తమ ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ దాన్ని తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈమధ్య మెగా ఫ్యామిలీ, మెగాస్టార్‌తో సహా అందరూ తాము చెసే పనులను వీడియోల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.     
  
అయితే మొన్న జక్కన్న తన ఇంటిని శుభ్రం చేస్తూ, ఆ వీడియోను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. దీంతోపాటు ఎన్‌టీ్ఆర్, రాం చరణ్‌లకు చాలెజ్‌ని విసిరాడు.  

అయితే ఈ చాలెంజ్‌ని ఆక్సెప్ట్ చేసిన ఎన్‌టీ్ఆర్,ఇల్లు తుడుస్తూ, గిన్నెలు  తోమిన వీడియోని పోస్ట్ చేసాడు. దీంతోపాటు జూ. ఎన్‌టీ్ఆర్ బాబాయి బాలయ్యకు, మెగాస్టార్ చిరంజీవికి, కింగ్ నాగార్జునకు, విక్టరీ వెంకటేష్‌కు, కొరటాల శివకు చాలెంజిని విసిరాడు.    

ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది.          

No comments:

Post a Comment