Monday 25 May 2020

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కి పోటీగా జియో మార్ట్



అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కి పోటీగా జియో మార్ట్


టెలికాం  రంగంలో జియో ఒక సంచలనం. జియో లాంచ్ అయ్యాక మొబైల్ మరియు ఇంటర్నెట్ వినియోగదారులు లెక్కకు మించి పెరిగిపోయారనడంలో సందేహం లేదు. ఎవరూ ఉహించని ప్లాన్స్ తో వచ్చిన జియో అతి తక్కువ  కాలంలో అధిక మొత్తంలో subscribers ని సంపాదించింది. జియో ముఖ్యంగా ఇంటర్నెట్ ప్లాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఉపయోగించని వారుకూడా ఇంటర్నెట్ ఎక్కువగా విరివిగా వాడడానికి కారణం  జియో.తక్కువ ధరలకే కాల్స్ మరియు ఇంటర్నెట్ ని అందించిది.దీనితో జియో కస్టమర్లు చాలా పెరిగిపోయారు.

ఇప్పుడు జియో కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. అదే ఆన్లైన్ సేవలు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మాదిరిగా జియో , జియో మార్ట్ పేరుతో ఆన్లైన్ డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. మొన్నటివరకు తాత్కాలికంగా ముంబయి  వరకు మాత్రమే ఈ జియో మార్ట్ సర్వీసును అందించింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా జియో మార్ట్ డెలివరీ సర్వీసులను ప్రారంభించిది. 

జియో మార్ట్ యాప్ ద్వారా, పాలు, పండ్లు, కూరగాయలు, కిరాణా సామగ్రి ని పొందవచ్చు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మాదిరిగా జియో మార్ట్ లో కుడా డిస్కౌంట్ సేల్ ని పెట్టింది. మీరు రూ. 700 కంటే ఎక్కువ  షాపింగ్ చేస్తేనే డెలివరీ చార్జీలు ఉండవు.

మరి ఇంకేదుకు ఆలస్యం ఒకసారి జియో మార్ట్ లో మీకు కావలిసిన సరుకులను వాటి ధరలను చెక్ చేసుకోండి, నచ్చితే బుక్ చేసుకోండి.

No comments:

Post a Comment