Tuesday 26 May 2020

సాయి ధరమ్ తేజ్ "నో పెళ్లి" పాటలో సందడి చేసిన వరుణ్ తేజ్, రానా

సాయి ధరమ్ తేజ్ "నో పెళ్లి" పాటలో సందడి చేసిన వరుణ్ తేజ్, రానా

 


నిన్న ఉదయం నితిన్, సాయి ధరమ్ తేజ్ నటించిన “సోలో  బ్రతుకే సో బెటర్” సినిమా  లోని “నో పెళ్లి” అనే పాటను twitter ద్వారా విడుదల చేసాడు. పాట చాల బాగుందని చెప్పిన నితిన్, నేనూ చూస్తాను ఎన్ని రోజులు సింగల్ గా ఉంటావో... కొన్ని సార్లు చేసుకోవడంలో టైం గ్యాప్ ఉంటుందేమో  గాని చేసుకోవడం పక్కా అంటూ సినిమా  స్టయిల్ లో కామెంట్ చేసాడు నితిన్.

SVCC బ్యానర్ పై, BVSN ప్రసాద్ నిర్మాతగా, సుబ్బు  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలా... వైకుంఠపురములో సినిమాతో తమన్ రేంజ్ ఒక్కాసారిగా పెరిగిపోయింది. దీనితో ఆయన చేసే కొత్త సినిమా పాటలపై అంచనాలు పెరిగాయి.

ఈ సోలో  బ్రతుకే సో బెటర్ సినిమా  లోని మొదటి  పాట “ నో పెళ్లి “.  ఈ పాటకు  రఘురామ్ లిరిక్స్ అందివ్వగా, అర్మాన్ మాలిక్ పాడారు. ఈ పాటకి కొరియోగ్రాఫర్ డీ డాన్స్ షో ఫేం యశ్వంత్ . ఈ ఈ పాట వింటుంటే అప్పట్లో త్రివిక్రమ్, నాగార్జున  కాంబినేషన్లో వచ్చిన మన్మధుడు సినిమాలోని “వద్దురా సోదరా ఈ పెళ్ళంటే నూరేళ్ళ మంటరా” అనే పాట గుర్తుకు వస్తోంది.  పెళ్లి చేసుకోవోద్దని సాయి ధరమ్ తేజ్ వెన్నెల కిషోర్ కి నచ్చ చెప్పే సందర్బములో వచ్చే పాట అని తెలుస్తోంది.

ఈ పాటలో వరుణ్ తేజ్,రానా కుడా సందడి చేసారు.  అయితే ఇక్కడ ఒకటి గమనించవచ్చు. వరుణ్ తేజ్ ఇంకా సింగిల్ కాబట్టి నో పెళ్లి అనొచ్చు. మరి రానాకి మొన్ననే ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి ఎప్పుడు  చేసుకుందామా అని ఎదురు  చూస్తున్నాడు.  ఇలాంటి టైం లో రానా ఈ  పాటలో  సందడి చేయడాన్ని “యూత్ లో స్లిప్ అఫ్ టంగ్  అనొచ్చు” అని  సాయి ధరమ్ తేజ్ tweet కి retweet ఇచ్చి సమర్ధించుకున్నాడు.

అలాగే ఈ పాట ఒక్కరోజులోనే 1 మిలియన్ క్లబ్ లోకి చేరిపోయింది. యూత్ కి కన్నెక్ట్ అయ్యే విధంగా ఉండటంతో అందరూ ఈ పాటని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment