Monday 18 May 2020

తెలంగాణలో జూన్ 4 వరకు లాక్ డౌన్ 4.0?



తెలంగాణలో జూన్ 4 వరకు లాక్ డౌన్ 4.0?


నిన్న కేంద్రం మే 31 వరకు లాక్ డౌన్ పొడగిస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో ఇప్పటికే మే 29 వరకు లాక్ డౌన్ అమలులో ఉంది. నిన్న కేంద్రం ఇచ్చిన సడలింపులను అమలు చేస్తూ తెలంగాణలో లాక్ డౌన్ ని జూన్ 4 వరకు పొడిగించాలని సీయం కేసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం తెలంగాణలో కేసులు పెరుగుతూ ఉండడమే  అని తెలుస్తోంది. జిహేచ్ఎంసి పరిధిలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. దీన్నికట్టడి చేయాలంటే కొన్ని రోజులు లాక్ డౌన్ పొడిగించడమే మంచిదని అధికారులు భావిస్తున్నారు.

అయితే కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అన్ని పాటించాలని కేసిఆర్ నాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.  తెలంగాణాలో రేపటి నుండి ఆర్టీసి బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈరోజు సాయంత్రం కేబినేట్ మీటింగ్ నిర్వహించి ఆర్టీసి బస్సుల అనుమతి, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలపై  సమగ్రంగా  చర్చ జరపబోతున్నారు. అంతరాష్ట్ర సర్విసులపై  ఇతర రాష్ట్రాలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నారు.
కంటోన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ఇంకా కఠినంగా అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈరోజు సాయంత్రం జరిగే కేబినేట్ మీటింగ్ తరువాత లాక్ డౌన్ పొడగింపు, బస్సు సర్వీసులు, ప్రజా రవాణా తో పాటు, ఇతర అంశాలపై ప్రకటన వచ్చే  అవకాశం ఉంది.

No comments:

Post a Comment