Friday 22 May 2020

“స్టేటస్” పెంచిన వాట్సాప్.....



“స్టేటస్” పెంచిన వాట్సాప్.....



లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్ళలో ఉండటం , ఇంటినుండే ఆఫీస్ పనులు చేయడంతో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.  దీనివల్ల ఇంటర్నెట్ సర్విస్ ప్రోవైడర్లపై బాగా భారం పడింది. దీనితో సర్విస్ ప్రోవైడర్లపై భారం పడకుంటా అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో వీడియోలను క్వాలిటీ తగ్గించి ప్లే చేస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ , అమెజాన్, హాట్ స్టార్ లాంటి వాట్లలో క్వాలిటి ని  తగ్గించాయి. యుట్యుబ్  కుడా వీడియో క్వాలిటిని తగ్గించింది. వాట్సాప్ కూడా వాట్సాప్ స్టేటస్ ని 30సెకన్ల నుండి 15 సెకన్ల వరకు తగ్గించింది.

అయితే ఇప్పుడు మెల్ల మెల్లగా లాక్ డౌన్ ఎత్తి వేస్తుండటంతో అన్ని వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్లు వీడియో క్వాలిటీని  పెంచే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికే వాట్సాప్, స్టేటస్ ని 15 సెకన్ల నుండి 30 సెకన్లకు పెంచింది. నెట్ ఫ్లిక్స్ హెచ్ డి క్వాలిటీ  వీడియోలు అందించబోతున్నట్లు ప్రకటించింది.

No comments:

Post a Comment