Thursday 17 December 2020

అడవి శేషు కొత్త మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు... Adivi Sesh Major Movie First Look...

 


Photo: Twitter / 
@urstrulyMahesh



అడవి శేషు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు అడవి శేషు కొత్త సినిమా మేజర్ సినిమా ఫస్ట్ లుక్ ని ట్విట్టర్ ద్వారా విడుదల చేసాడు. ఈ సందర్భంగా మహేష్ బాబు అడవి శేషు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. అలాగే ఈ మేజర్ సినిమా తప్పకుండా నీ బెస్ట్ పెర్ఫార్మన్స్ లలో ఒకటిగా నిలుస్తుందని మహేష్ బాబు చెప్పాడు.


ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా 26 / 11 సమయంలో యోధుల్లో ఒకరిగా నిలిచిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అడవి శేషు మేజర్ గా నటిస్తున్నాడు.


అడవి శేషు, ఈ పేరు కొత్త తరహా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే అడవి శేషు సెలక్ట్ చేసుకొనే సినిమాలు చూస్తేనే మనకు అర్ధమవుతుంది. ఆయన చేసిన క్షణం, గూడాచారి, ఎవడు సినిమాలు చూస్తేనే ఆయన ఎంత విలక్షణ కథలు ఎంచుకుంటాడో అర్ధమవుతుంది. క్షణం సినిమాని బాలీవుడ్ లో రిమేక్ చేయడం జరిగింది. అలాగే గూడాచారి సినిమాని కూడా బాలీవుడ్ లో రిమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఇప్పుడు ఈ మేజర్ చిత్రం ఎలాంటి ప్రశంసలు అందుకుంటుందో వేచి చూడాలి.


ఈ సినిమాని మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ మరియు A + S మూవీస్ వారు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే సమ్మర్ కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


No comments:

Post a Comment