Saturday, 19 December 2020

తెలుగులో మరో ott సంస్థ ప్రారంభం... New Telugu OTT Urvasi started

 

ప్రముఖ రచయిత చేతుల మీదుగా కొత్త  తెలుగు ఓటిటి ప్రారంభం...


Image Source: Google


కరోనా మహమ్మారి వల్ల సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి, షూటింగ్ అయిన సినిమాలు విడుదల చేయడానికి థియేటర్లు తెరుచుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితి ott లకు ప్ర్రాణం పోసిందనేచెప్పొచ్చు. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలను నేరుగా ott లో విడుదల చేయడం జరిగింది. చిన్న సినిమాలకు ఇది మేలు చేసినా, పెద్ద సినిమాలకు మాత్రం కొంత నిరాశని మిగిల్చాయనే చెప్పాలి. కానీ ott కి మాత్రం డిమాండ్ తగ్గలేదు. అందుకే మన టాలీవుడ్ పెద్దలు ott లను ప్రారంభిస్తున్నారు. మొదటగా మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ ఆహా ott తో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో మరికొందరు సెలేబ్రిటీలు ott ని ప్రారంభించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.


ఇప్పుడు  తెలుగులో మరొక ott సంస్థ ప్రారంభం అయింది. హైదరాబాద్ లో కొత్తగా ఊర్వశి ఓటిటి కార్యాలయం ప్రారంభం అయింది. ఈ కార్యాలయాన్ని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సంస్థ ప్రత్యేకత సినిమా నిర్మాణానికి అవసరమైన పూర్తి స్థాయి సాంకేతిక సహకారం అందించడం తో పాటు,విడుదల పరంగాను సపోర్ట్ చేయనుండడం. అలాగే ఊర్వశి ఓటిటి విభిన్నమైన సినిమాలు, షోలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని  విజయేంద్ర ప్రసాద్ ఆకాక్షించారు.


తమ ఊర్వశి ఓటిటి కార్యాలయం సంచలన రచయిత విజయేంద్ర ప్రసాద్ గారి చేతులమీదుగా ప్ర్రారంభం కావడం సంతోషంగా ఉందని ఆ సంస్థ డైరక్టర్స్ రవి కనగాల,ఎం ఎస్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఇనాగురల్ ఆఫర్ కింద ఊర్వశి ఓటిటి లో ఈ నెల చివరి వరకు ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించారు.


No comments:

Post a Comment