హెచ్-1బీ వీసాలపై మార్చి 31 వరకు నిషేధాన్ని పొడగింపు...
ట్రంప్ నిర్ణయం తో భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం...
మరో 20 రోజుల్లో అమెరికా
అధ్యక్ష పదవి నుండి దిగిపోతున్న వేళ, ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచనలనం గా
మారింది. ఎప్పటినుండో హెచ్-1 బీ వీసాల పై వ్యతిరేకతతో ఉన్న ట్రంప్, మరోసారి తన
పంథాని చాటుకున్నారు. హెచ్-1 బీ వీసాలపై ఉన్న నిషేదాన్ని మరో మూడు నెలల పాటు
పొడిగిస్తూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసారు. దీనితో మార్చి 31
వరకు గ్రీన్ కార్డులు, వర్క్ వీసాలపై ఈ నిషేధం కొనసాగుతుంది. గత ఏడాది ఏప్రిల్,
జూన్ నెలల్లో రెండు సార్లు ఈ వీసాలపై ఆంక్షలు విధించడం జరిగింది. ఈ గడువు డిసెంబర్
31 తో ముగియడంతో ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయంతో అమెరికాలో
ఉద్యోగం చేయాలనే భారతీయ ఐటీ నిపుణుల ఆశలను మరికొన్నాళ్ళు వాయిదా వేసుకోవాల్సిన
పరిస్థితి ఏర్పడింది. అంటే అమెరికాలో ఉద్యోగం ఆశించేవారు హెచ్-1 బీ వీసా కోసం మరో
3 నెలల పాటు వేచి చూడాల్సిందే.
అలాగే ఇపటికే అమెరికాలో
ఉద్యోగం చేసే ప్రవాసులపై కూడా దీని ప్రభావం పడింది. వారి వీసా రెన్యువల్ అవ్వడానికి
జాప్యం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ వీసాల ద్వారా దాదాపు లక్ష మంది భారతీయులు ఉద్యోగం
చేస్తున్నారు. కరోనా కారణంగా అమెరికాలో ఉద్యోగ భద్రత ఏర్పడింది, దీనికోసమే ఈ
వీసాలపై నిషేధాన్ని పొడగించామని ట్రంప్ తెలిపారు.
అయితే ఇక్కడ అమెరికాలో
ఉద్యోగం చేయాలనుకునే వారికి అనుకూల అంశం ఏంటంటే మరో 20 రోజుల్లో అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ గద్దె దిగనున్నాడు. ఈ
విషయం పై నూతన అధ్యక్షడిగా ఎన్నికైన బైడేన్ మాట్లాడుతూ ట్రంప్ విధానాలు క్రూరంగా
ఉన్నాయి, తాను అధ్యక్ష పదవి చేపట్టగానే హెచ్-1 బీ వీసాలపై నిషేధాన్ని
ఎత్తివేస్తానని హామీ ఇచ్చారు.
No comments:
Post a Comment