Friday, 1 January 2021

OLX లో ఆ అమ్మాయికి ఏం జరిగిందంటే…

 





రోజు రోజుకూ ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఎందుకంటే అందరూ ఆన్లైన్ లో వస్తువులు కొనడం, అమ్మడం లాంటివి చేస్తుండటంతో ఈ రకమైన మోసాలకు ఎక్కువగా అవకాశం ఏర్పడింది.  ఈ మధ్య OLX లావా దేవీల్లో సైబర్ నేరగాళ్ళ మోసాలు ఎక్కువవుతున్నాయని చెప్పొచ్చు. ఈ విషయంలో మన సైబరాబాద్ పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారని చెప్పొచ్చు.  అలాగే ఈ మోసాల గురించి ప్రజలకు తెలిసేలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా చేస్తున్నారు.


అయితే కొద్దిరోజులక్రితమే సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీ.సి . సజ్జనార్ twittar వేదికగా, ఈ OLX లావా దేవీల్లో మోసాగాళ్ళ వలలో పడొద్దని విజ్ఞప్తి చేసారు. చాలా జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరగాళ్ళు ఎలా మనను మోసం చెయ్యొచ్చో  ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రజలకుతెలియజేసారు.


మనకు OLX నుండి కాల్ వచ్చినప్పుడు, మీ వస్తువును కొంటామని చెప్పినప్పుడు, మనం తొందరలో అన్నీ మర్చిపోయి, అవతలి వ్యక్తి అడిగిన వెంటనే ఆలోచించకుండా మనకు సంబందించిన విషయాలు  ఏవీ చెప్పకపోవడం మంచిది.


ఇక్కడ మనం ఒక చిన్న స్టోరీ ద్వారా మనం ఈ మోసగాళ్ళ నుండి ఎలా జాగ్రత్త పడవచ్చో చూద్దాం…

పూణే లో ఒక అమ్మాయి OLX లో రూ. 3500 కి ఒక వస్తువును అమ్మకానికి పెట్టింది. కానీ చాలా రోజుల వరకు ఆ వస్తువును కొనడానికి ఆసక్తి చూపలేదు. కొన్ని రోజుల తరువాత ఆ అమ్మాయికి ఒక అతని దగ్గరినుండి మెస్సేజ్ వచ్చింది. మీ వస్తువు చాలా నచ్చింది, నేను కొంటాను అని మెస్సేజ్ వచ్చింది.


అయితే తాను ఆన్లైన్ లో డబ్బులు పంపుతానని, అతని ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి, ఆ అమ్మాయి బ్యాంక్ వివరాలను పంపించామన్నాడు. అతను చెప్పినట్టే చేసింది ఆ అమ్మాయి. రెండు నిమిషాలో ఆ అమ్మాయికి ఒక మెస్సేజ్ వచ్చింది. ఆ ఎసెమెస్ లో అమ్మాయి ఖాతాలో రూ.13500 జమ అయినట్టు మెస్సేజ్ వచ్చింది.


వెంటనే ఆ అమ్మాయికి అతడినుండి ఫోన్ వచ్చింది. అతను ఇలా చెప్పడం జరిగింది. రూ.3500 బదులు రూ. 13500 పంపడం జరిగింది. నేను మా అమ్మగారికి ఆరోగ్యం బాగా లేనందున హాస్పేటల్ లో వున్నాను. మీరు మిగిలిన రూ.10000 తిరిగి పంపండి అని అన్నాడు.


ఆ అమ్మాయి అతడి బ్యాంకు వివరాలు అడిగింది. తాను paytm వాడుతానని దానికే డబ్బులు పంపాలి అని చెప్పి, బ్యాంకు వివరాలు ఇవ్వడానికి నిరాకరించాడు.

ఇంతలో ఆ అమ్మాయి తన ఖాతాలో బ్యాలెన్స్ ని చెక్ చేసుకుంది. తనకు దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఎందుకంటే అసలు తన ఖాతాలో రూ. 13500  జమ కాలేదు. దీనితో అమ్మాయి బ్యాంక్ కి ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది. వారు కూడా ఎలాంటి డబ్బు జమ కాలేదని చెప్పడం జరిగింది.


అంటే అతని ఆ అమ్మాయికి డబ్బు పంపించానని అబ్బదపు మెస్సేజ్ పంపించి డబ్బు కాజేయాలనే ప్రయత్నం చేయడం జరిగింది.


NOTE:  ఇలాంటివి జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కొనేవారిని / అమ్మేవారిని  చూడకుండా అమ్మడం / కొనడం చేయకూడదు.

మీయొక్క బ్యాంకు వివరాలను ఇవ్వకూడదు.

అవసరమైతే కొనేవారి /  అమ్మేవారి aadhaar card తీసుకోవడం మంచిది.


No comments:

Post a Comment