నిరంతరం పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేస్తే కేంద్ర ప్రభుత్వ పతనం తప్పదని ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్ హెచ్చరించారు. విపరీతంగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ( ఎఐటియుసి ) ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని వై జంక్షన్లో బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని లాక్కునే ప్రయత్నం చేసే క్రమంలో మంటలు చెలరేగి ఇద్దరు ఆటో డ్రైవర్లు నరసింహ, జమీలపై పడి స్వల్ప గాయాల య్యాయి .
ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఎఐటియుసి నేతలు , పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం , తోపులాటలు జరిగాయి . కొందరు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యత రేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు . పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా అరెస్ట్ చేశారు . అంతకుముందు ఆటో కార్మికులనుద్దేశించి వి.ఎస్.బోస్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇంధన ధరలు నిత్యం పెంచి ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు . బిజెపి ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా స్వదేశీ , విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదని , అందుకే సంస్కరణల పేరుతో దేశ ప్రజలపై మరిన్ని భారాలు వేస్తున్నదని విమ ర్శించారు . ఆర్థిక అసమానతల కారణంగా ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీశాయని , ఎన్నడూ లేనివిధంగా ఇంధనం ధరలు పెరుగుతుంటే ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు . డీజిల్ , పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల అన్ని నిత్యావస రాల వస్తువులు , కూరగాయల ధరలు 20 శాతం రెట్లు పెరిగాయని అయన తెలిపారు . రోజురో జుకు పెంచుతున్న పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ ధర లను వెంటనే నియంత్రించి , పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని లేకుంటే తగ్గించే వరకు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని బోస్ హెచ్చరించారు .
తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.వెంక టేశం మాట్లాడుతూ నిరంతరం పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ ధరల పెంపుదలతో సామాన్యుడిపై భారం విపరీతంగా పడుతుందని , ముఖ్యంగా రవాణా కార్మికుల నడ్డి విరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికే ఉన్న కరోనా విపత్కర పరిస్థి తుల్లో దేశంలోని రవాణా కార్మికులు ఇప్పటి వరకు కూడా ఉపాధి , ఆదాయం లేకుండా అల్లాడు తుంటే ఊరటనివ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం .. ఇంధన ధరలు పెంచడం దారుణమన్నారు . తక్షణమే పెంచిన ఇంధన ధరలు తగ్గించి , పెట్రోల్ , డీజిల్ , గ్యాన్లను జిఎస్టీ పరిధిలోకి తీసుకరావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు .
No comments:
Post a Comment