ప్రపంచ మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా వ్యాప్తి చెందకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొన్న విషయం మీకు విదితమే. మొదటి నుంచి పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండి, అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తూ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడగలిగింది. టీసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానంలో కరోనాను సమర్ధవంతంగా కట్టడి చేయగలిగాము. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి సూచనలు, సలహాలతో వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు తమ ప్రాణాలకు తెగించి సైనికుల్గా పోరాడి కరోనాపై యుద్ధం చేశారు. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలందరూ ఇళ్ళకి పరిమితం కాగా వైద్య, పోలీస, మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖల సిబ్బంది 24 గంటలు ప్రజలకు సేవలు అందించారు. ఆ సమయంలో ప్రజాప్రతినిధులుగా మీరు అందించిన సహాయ సహకారాలు వెలకట్టలేనివి . ఎంతో మంది ఆకలితీర్చారు. కష్ట కాలంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి చేదోడువాదోడుగా ఉన్నందుకు మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వం తరపున హృదయ పూర్వక ధన్యవాదములు అని లేఖలో ఆరోగ్యా శాఖ మంత్రి తెలిపారు.
కరోనా నివారణకు ఈ నెల 16 నుండి వాక్సిన్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నాము. ముందుగా వైద్య ఆరోగ్య సిబ్బందికి , ఆ తరువాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, ఆ తరువాత 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి మరియు దీర్ఘ కాలిక వ్యాదులు ఉన్న వారికి వాక్సిన్ ఇస్తారు. జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఈ ఏర్పాట్లను చూస్తున్నారు. వ్యాక్సిన్ కార్యక్రమం సజావుగా జరగడంలో భాగస్వాములు కావాల్సిందిగా అదేశాలు జారీచేశారు. వాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రాధాన్యతా క్రమంలో వాక్సిన్ అందించడానికి వీరు, స్థానిక ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో క్రియాశీల పాత్ర పోషించాలని అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా జరిగి, తెలంగాణ మారాలనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్షను నెరవేర్చాలని అభ్యర్థిస్తున్నాను. కరోనా రహిత రాష్ట్రంగా అవతరించాలని ఆకాంక్షించారు.
No comments:
Post a Comment