Saturday 11 April 2020

పవన్ కళ్యాణ్ ,రవితేజ మల్టీస్టారర్ మూవీ


పవన్ కళ్యాణ్ ,రవితేజ మల్టీస్టారర్ మూవీ .... మరి దర్శకుడెవరు


ఈమద్య తెలుగు హీరోలు ముల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ముందుకొస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే రచయితలు కథలను కూడా అలాగే రాసుకుంటున్నారు. ప్రస్తుతానికి ట్రెండ్‌లో ఉన్న ముల్టిస్టారర్ మూవీ రాజమౌళి  ఆర్ ఆర్ ఆర్. ఇందులో జూ.ఎన్ టి ఆర్ , రాం చరణ్ కలసి నటిస్తున్నారు. 

అయితే ఇప్పుడు ఇంకొక క్రేజీ ముల్టీస్టారర్ వస్తుందనే చెప్పాలి. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజ రవితేజ కలిసి నటించబోతున్నారు. అప్పుడెప్పుడో రవితేజ నేల టికెట్టు సినిమా ఫంక్షన్‌లో కథ కుదిరితే రవితేజతో నటించడానికి నేను రెడీ అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అన్నట్టుగానే అది  జరగబోతోందని తెలుస్తోంది.  ఇది ఒక తమిళ సినిమా రేమేక్ అని తెలుస్తోంది. దీన్ని పవన్ కళ్యాణ్ స్నేహితుడు రాం తళ్ళూరి నిర్మాత.    

పవన్ కళ్యాణ్‌తో కాటమరాయుడు, గోపాల గోపాల సినిమాలకు దర్శకత్వం వహించిన డాలి ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించబోతున్నాడు.    

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్  సాబ్ చివరి దశకు వచ్చింది. క్రిష్‌తో విరూపాక్ష అనె టైటిల్‌తో ఒక సినిమా చేస్తున్నడు.

రవితేజ ప్రస్తుతం క్రాక్  సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.           

No comments:

Post a Comment