Thursday 12 November 2020

కూల్ డ్రింక్స్ వల్ల కలిగే ప్రమాదాలు, Cool drinks causes problems

 




ఏ కాలం అయినా చల్లని పదార్థాలు తీసుకుంటాం. అందులోనూ.. శీతల పానీయాలు ( కూల్ డ్రింక్స్ ) మరీ ఎక్కువ. కానీ .. అది ప్రమాదం అని గ్రహించాలి. వీటి ద్వారా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి !  మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే కదా ? అలాగే తాగేవి ఆరోగ్యంతో పాటు గర్భధారణ పై తీవ్ర ప్రభావం చూపుతాయనేది గ్రహించాలి.

 


సోడాలు, ఇతర శీతల పానీయాలు తాగితే స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతాయి. తెలియకముందు తాగితే ఏం చేస్తాం ? కానీ .. సమస్య తీవ్రతేంటో తెలిసిన తర్వాత కూడా శీతల పానీయాలను ఆస్వాదించడం .. వాటి ద్వారా కలిగే క్షణపాటు ఆనందాన్ని అద్భుతమనుకోవడం తప్పు.  శీతల పానీయాల్లో తీపి కోసం ఆస్పర్టేమ్ (aspartame) అనే కృత్రిమ పదార్థాన్ని కలుపుతారు. ఇది ఎండొకైన్ (endocrine) గ్రంథులపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి స్త్రీలలో సంతానోత్పత్తి సమస్యలు కలుగుతాయి. శీతల పానీయాలు ఎక్కువగా సేవించడం వల్ల అండాశయ సమస్యలు, బహిష్టు పూర్వ సమస్యలు ఏర్పడుతాయి. ఇటీవల గర్భస్రావాలు, శిశు వైకల్య సమస్యలు ఎక్కువవుతున్నాయి.


 

ఆస్పర్టేమ్ లో ఫినైలలానిన్ (phenylalanine) , ఆస్పెక్టిక్ యాసిడ్ అనే రెండు అమైనో ఆమ్లాలు ఉంటాయి. వీటిని ఇతర అమైనో ఆమ్లాలలో కలిపి తీసుకుంటే ఎలాంటి  హాని ఉండదు. కానీ వేటిలో కలపకుండా తాగితేనే శరీరంలోని కణాలు చనిపోయే ప్రమాదం ఉంది . మరీ ఎక్కువగా వీటిని తాగితే మగవారిలో వీర్యం.. ఆడవారిలో అండం కణాలు 90 % చనిపోయే ప్రమాదం ఉంది .


 

మోతాదుకు మించి తాగితే.... అతిగా శీతల పానీయాలు తాగటం వల్ల రోగ నిరోధకశక్తి క్షీణిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత , అధిక బరువు సమస్యలు ఏర్పడతాయి. గర్భస్రావం , గర్భధారణ సరిగా లేకపోవడం జరుగుతాయి. ఎక్కువగా శీతల పానీయాలు తాగే పురుషులలో నాలుగింతలు వీర్యకణాల కౌంట్, చలనం, ఏకాగ్రత తగ్గే అవకాశం ఉన్నది. సోడాలో ఎక్కువ ఆమ్లాలు ఉంటాయి . వాటివల్ల శరీరంలోని పీహెచ్ శాతం మారిపోతుంది. తద్వారా వీర్యకణాలు ఆకారం మారడం, నాణ్యత లోపించడం, లేదా చనిపోవడం జరగవచ్చు. ఇంకా బిస్ ఫినాల్- ఎ కెమికల్ వల్ల పురుషుల వీర్య ద్రవం నాణ్యత క్షీణిస్తుంది.  చాలావరకు శీతల పానీయాలలో కెఫెన్ కలుస్తుంది. ప్రక్టోస్ కూడా ఉంటుంది .


 

 వీటివల్ల అండాశయ సమస్యలు .. సంతానోత్పత్తి సమస్యలు స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తాయి. కెఫెన్ వల్ల రక్త నాళాలు ముడుచుకుపోతాయి. తద్వారా గర్భసంచిలోకి రక్తప్రసరణ తగ్గిపోతుంది. రుతుక్రమం తగ్గిపోతుంది. కెఫెన్, ఆస్పమ్, ఫ్రక్టోస్ కలిపి సేవించడం వల్ల సెక్స్ హార్మోన్లు, వాటి గ్రాహకాలపై ప్రభావం పడుతుంది. తద్వారా వంధ్యత్వం ఏర్పడుతుంది. గర్భం దాల్చాలనుకునేవారు ఎరేటేడ్ పానీయాలు మానేయాలి. అలా చేస్తేనే సంతానోత్పత్తి పై ప్రభావం ఉండదు. కూల్ డ్రింక్స్ తాగకుండా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పరిరక్షించుకోండి!


No comments:

Post a Comment