Image Source:(Chiranjeevi): Twitter / @KChiruTweets
అసలు చిరంజీవి కరోనా బారిన పడలేదు, RT PCR కిట్ లో లోపం... తేల్చేసిన డాక్టర్లు....
మెగాస్టార్ లాంటి వాళ్ళకే ఇలా తప్పుడు రిపోర్టులు ఇస్తే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి!
మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా వచ్చిందని ప్రకటించగానే, మెగా అభిమానులతో
పాటు, తెలుగు సినిమా ఇండస్ట్రీ, యావత్ తెలుగు ప్రజలందరూ ఉలిక్కి పడ్డారు. తనను
అభిమానించే వారందరూ మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు, పూజలు చేసారు.
దీనితో టాలీవుడ్ ఇండస్ట్రీ, సేలేబ్రిటిలు ఉలికి పడ్డారని చెప్పొచ్చు. తమ్ముడు పవన్
కళ్యాణ్ కూడా అన్నయ్య చిరంజీవి త్వరగా కోలుకోవాలని జనసేన తరుపున ఒక లేఖను విడుదల
చేసారు.
కానీ మెగాస్టార్ తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని ప్రకటించగానే అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. మెగాస్టార్ చిరింజీవి తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసారు. తనకు ముగ్గురు డాక్టర్లు, ఒక్కొక్కరిగా మూడు సార్లు పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షల్లో COVID నెగెటివ్ వచ్చిందని తెలిపారు. ఇంతకుముందు వచ్చిన రిజల్ట్ RT PCR కిట్ లోపం వల్ల తప్పుగా పాజిటివ్ అని వచ్చింది అని ఆయన చెప్పారు. ఈ సమయంలో నాకోసం మీరందరూ చూపించిన ప్రేమాభిమానాలకు, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళకే ఇలాంటి తప్పిదాలు
జరిగితే, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటనేది
ఉహించుకోవచ్చు. చిరంజీవి కాబట్టి ఒకటికి మూడు సార్లు టెస్టులు చేయించుకొని కరోనా
నెగెటివ్ అని నిర్ధారణ చేసుకోగలిగారు. మరి అంత డబ్బులేని వారు అదే నిజమని నమ్మి
మానసికంగా చాలా ఇబ్బంది పడే వారు కదా.
దీన్నిబట్టి చూస్తే కరోనా టెస్టు ఒకటికి రెండుసార్లు చేయించుకున్నాక
మాత్రమే మనకు కరోనా పాజిటివ్ లేదా నెగెటివ్ వచ్చింది అనేది నిర్ధారణ చేసుకోవడం
మంచిదేమో.
No comments:
Post a Comment