కరోనా మహమ్మారి వల్ల, సినిమా ఇండస్ట్రీ తో పాటు, దానిపై
ఆధారపడిన వాళ్ళు చాలా నష్ట పోయారని చెప్పొచ్చు. ఈ కరోనా వల్ల సినిమాలు థియేటర్లలో
విడుదల కావడంలేదన్న సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లో విడుదల అయినప్పుడు కూడా ఆన్
లైన్ స్ట్రీమింగ్ OTT బిసినెస్ బాగా పాపులర్ అయింది.
అయితే కరోనా వల్ల సినిమాలు థియేటర్లో విడుదల
కాకపోవడంతో OTT లో విడుదల చేస్తున్నారు.
దాని వల్ల OTT సంస్థల మద్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. దీనితో సబ్‌స్క్రైబర్లను పెంచుకునే
దిశగా నెట్‌ఫ్లిక్స్ ఒక గుడ్
న్యూస్ చెప్పింది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ ఫెస్ట్
ని డిసెంబర్ 5 న ప్రారంభిస్తున్నట్టు
సంస్థ ప్రకటించింది. ఈ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ ఫెస్ట్
డిసెంబర్ 5 వ తేదీ తెల్లవారు జామున 12.01 నుండి 6 వ తేదీ రాత్రి 11.59 వరకు నిర్వహిస్తున్నట్టు
ప్రకటించింది. అయితే ఈ 48 గంటలు యూజర్లు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ లో కంటెంట్ ని వీక్షించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే సబ్‌స్క్రైబర్లు కానివారు కూడా ఈ నెట్‌ఫ్లిక్స్ ఫెస్ట్ లో
పాల్గొనవచ్చని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
No comments:
Post a Comment